Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ సెక్సీయెస్ట్ మ్యాన్ ఎలైవ్: ఈ 40ఏళ్ల బెక్‌హమ్

లాస్‌ఏంజిల్స్: బ్రిటిష్‌ సాకర్ దిగ్గజం డేవిడ్ బెక్‌హామ్‌ మరో ఘనత సొంతం చేసుకున్నాడు. ఆన్ ఫీల్డ్ లోనేగాక, ఆఫ్ ఫీల్డ్ లోనూ అంతర్జాతీయ సెలబ్రిటీగా పేరొందిన ఆయనను పీపుల్ మేగజైన్ ప్రపంచంలోనే జీవించి ఉన్న వ్యక్తల్లో శృంగార పురుషుడిగా(సెక్సీయెస్ట్ మ్యాన్‌ అలైవ్) ఎంపిక చేసింది.

మేగజైన్ 30వ వార్షికోత్సవ వేడుకల్లో ఈ టైటిల్‌ను అందుకున్న 40 ఏళ్ల బెక్‌హమ్‌ మాట్లాడుతూ.. ఈ పురస్కారం అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. తను ఎంతో సంతోషంగా పురస్కారాన్ని స్వీకరిస్తున్నట్టు తెలిపాడు. తాను మంచి డ్రెస్సులు, సూట్‌లు వేసుకుంటూ మరింత అందంగా కనిపిస్తానని చెప్పుకొచ్చాడు.

David Beckham Named People Magazine's 'Sexiest Man Alive'


కాగా, రిటైర్డ్ ఫుట్‌బాల్ ఆటగాడైన డేవిడ్ బెక్‌హామ్ సతీమణి విక్టోరియా బెక్‌హమ్(41) ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్‌. దీంతో ఆయన అందంగా కనిపించేందుకు ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. తను ఈ అవార్డు తీసుకునేందుకు తన భార్య విక్టోరియా కూడా కారణమేనని డేవిడ్ బెక్‌హమ్ చెప్పాడు.

నలుగురు పిల్లలకు తండ్రి అయిన తాను ఈ వార్డును దక్కించుకోవడం తనకు లభించిన అభినందనగా భావిస్తానని చెప్పాడు. సహజంగా అందగాడు, ప్రముఖ ఆటగాడు అయిన బెక్‌హామ్ పెప్సీ, ఆడిదాస్ వంటి ప్రముఖ వాణిజ్య ప్రకటనల్లోనూ నటించాడు. జార్జియో ఆర్మానీ అండర్‌వేర్‌లకు మోడల్‌గా వ్యవహరించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+