షూటింగులు లేక ఇబ్బంది పడుతున్న సుమారు రెండు వేల వుంది సినీ కార్మికులకు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయుణరావు ఆధ్వర్యంలో శనివారం నిత్యావసర సరుకులను అందజేశారు. ఫైటర్ల వివాదంతో గత 18 రోజులుగా సిని షూటింగ్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే.దీంతో ఉపాధి లేక ఇక్కట్లపాలైన సినీ కార్మికులను ఆదుకునేందుకు దాసరి ఆదేశాలతో వివిధ సినీ కార్మిక సంఘాల నేతలు ముందుకొచ్చారు. ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం, కిలో పప్పు, కిలో నూనె, కిలో చింతపండు, కిలో పంచదారతో కూడిన ప్యాకేజీ అందజేశారు. ఫిలిం ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె.రాజేశ్వరరెడ్డి, జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడు డి.స్వామిగౌడ్, ప్రొడక్షన్ మేనేజర్ సాంబశివరావు పాల్గొన్నారు.ఇక ప్రస్తుతం దాసరి నారాయణరావు...బాలకృష్ణ హీరోగా పరమవీర చక్ర చిత్రం రూపొందిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం విడుదలకానుంది.