Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రజా క్షేత్రంలో రెజర్ల పోటీ: వినేశ్ ఫొగాట్ X కవిత దలాల్

భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, కవిత దలాల్. వీరిద్దరు గతంలో ఒకరికోసం ఒకరు నిలబడ్డారు. కానీ ఇప్పుడు ప్రత్యర్థుల్లా తలబడుతున్నారు. అయితే అది మ్యాట్‌పై కాదు ప్రజా క్షేత్రంలో. హర్యానాలోని జింద్ జిల్లాలోని జులానా నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడతున్నారు. కాంగ్రెస్ నుంచి వినేశ్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కవిత పోటీ చేస్తున్నారు.

గతంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా వినేశ్ ఫొగాట్, కవిత దలాల్ కలిసి జంతర్ మంతర్ వద్ద పోరాడారు. వినేశ్ పక్కన కూర్చొని కవిత పూర్తి మద్దతు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఇద్దరూ పోటీపడుతున్నారు. అయితే దీని గురించి ప్రముఖ జాతీయ మీడియాతో వారిద్దరు మాట్లాడారు.

Dangal in Julana Wrestlers Vinesh Phogat and Kavita Dalal Clash in the Political Arena

''ఓ మహిళగా నేను వినేశ్ ఫొగాట్‌కు మద్దతు ఇస్తానని, ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతానని అందరికి తెలుసు. కానీ ఆ గొడవను వినేశ్ ఫొగాట్, కాంగ్రెస్ రాజకీయం చేశారు. రెజ్లింగ్ రాజకీయంగా మార్చి ఎన్నికలు గెలవాలని చూస్తున్నారు. జులానా ప్రజలు దీన్ని తప్పక గమనిస్తున్నారని, నేను విజయం సాధిస్తానని తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, బీజేపీ కాని ఇక్కడ ప్రజలకు ఏమీ చేయలేదు. కానీ మేం చేస్తాం. ఇక ఓ మహిళగా వినేశ్‌కు మద్దతు ఇస్తా, అలాగే నేను పోరాడి ఆమెను ఓడిస్తా''- కవిత దలాల్

'' నేను పోటీకి ఎప్పుడూ సిద్ధమే. రెజ్లింగ్‌లో పోటీకి రాకుండా ఎవరినైనా ఆపగలమా? ఇప్పుడు ఆమెను రమ్మందాం. జంతర్ మంతర్ వద్ద ఆమె నాతో కలిసి ఉంది. కానీ ఆమెతో ఇక్కడ పోటీకి సిద్ధంగా ఉన్నాను. ఇక నేను ఐశ్వర్య రాయ్‌ను ఏం కాదు. నా పనిని నేను ఎంచుకున్నాను. నా పనితనం ఫలితాన్ని చూపుతుంది ''- వినేశ్ ఫొగాట్

జులాన్‌ నియోజకవర్గంలో జాట్ వర్గం ఎక్కువగా ఉంటుంది. వినేశ్, కవిత ఇద్దరూ జాట్ వర్గానికి చెందినవారే. ఈ నేపథ్యంలో జులాన్‌ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ నుంచి యోగేశ్ బైరాగి పోటీ చేస్తున్నారు.

Story first published: Thursday, September 26, 2024, 17:43 [IST]
Other articles published on Sep 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+