కృపాశంకర్ బిష్ణోయ్: 'దంగల్' నిజమైన కోచ్ ఎవరో తెలుసా?
హైదరాబాద్: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొడుతుంది. భారత మాజీ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగాట్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమాలో గీతా కుమారి ఫోగాట్ పాత్రలో ఫాతిమా సనా షేక్ అనే అమ్మాయి నటించింది.
కామన్వెల్త్ క్రీడల ఫైనల్లో దాదాపు ఓడిపోయిన పరిస్థితుల్లో ఒకే ఒక్క మూవ్‌తో ఐదు పాయింట్లు సాధించి బంగారు పతకం సాధించిన వైనాన్ని ఈ సినిమాలో దర్శకుడు అద్భుతంగా చూపించాడు. ఈ సినిమా నిర్మాణంలో భాగంగా ఫాతిమా సనా షేక్ రెజ్లింగ్ నేర్చుకుంది. ఆమెతో పాటు ఈ సినిమాలో నటించిన మరికొందరు కూడా రెజ్లింగ్ నేర్చుకున్నారు. వీరందరికీ రెజ్లింగ్ పాఠాలు నేర్పింది ఎవరో తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు.
సినిమాలో అయితే అమీర్ ఖాన్ వీరికి రెజ్లింగ్ పాఠాలు నేర్పితే తెర వెనుక ఓ ఫేమస్ రెజ్లర్ వీరికి ట్రైనింగ్ ఇచ్చాడు. ఆయన ఎవరో కాదు... 2005 కామన్వెల్త్ క్రీడల్లో రెజ్లింగ్ విభాగంలో భారతదేశానికి స్వర్ణ పతకాలు సాధించిన కృపాశంకర్ బిష్ణోయ్. 40 ఏళ్ల కృపాశంకర్ బిష్ణోయ్ సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ దంగల్ సినిమా కోసం బూట్లు వేసుకుని రెజ్లింగ్‌లోకి దిగారు.

అర్జున అవార్డు గ్రహీత కృపాశంకర్ బిష్ణోయ్
భారత ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు అందుకున్న కృపాశంకర్ బిష్ణోయ్ ఇండోర్‌లోని తన ట్రైనింగ్ క్యాంప్‌లో 2015లో బిజీగా ఉన్న ఆ రోజు సడన్‌గా ఓ ఫోన్ వచ్చింది. మేము అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి ఫోన్ చేస్తున్నామని, అమీర్ రాబోయే చిత్రం దంగల్ కోసం ఆయన మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారంటూ అవతలి నుంచి వాయిస్ వినిపించగానే నాతో జోక్ చేస్తున్నారా? అని ప్రశ్నించిన బిష్ణోయ్ ఫోన్ కట్ చేశాడు.

అమీర్ ఖాన్ నుంచి ఫోన్
కొద్ది రోజుల తర్వాత అదే నెంబర్ నుంచి తనకు మళ్లీ ఫోన్ రావడంతో ఎంతగానో సంతోషపడ్డాడు. ఆయనే అమీర్‌ఖాన్‌తో పాటు ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, జైరా వసీమ్, సుహానీ భట్నాగర్ వీళ్లందరికీ రెజ్లింగ్‌లో శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా దంగల్ సినిమాలో నటించిన అమ్మాయిలకు ఎలా శిక్షణ ఇచ్చామన్న విషయమై యూటీవీ మోషన్ పిక్చర్స్ ఓ వీడియో విడుదల చేసింది.

తమ అనుభవాలను పంచుకున్న దంగల్ అమ్మాయిలు
ఇందులో అమీర్‌ఖాన్, దర్శకుడు నితేష్ తివారీ, శిక్షకుడు కృపాశంకర్ బిష్ణోయ్, నటించిన అమ్మాయిలు అంతా తమ అనుభవాలను పంచుకున్నారు. సినిమాలలో నటించడం నుంచి నిజమైన రెజ్లింగ్ చేసేవరకు తమను కోచ్ ఎలా మార్చారో వివరించారు. ప్రముఖ ఇండియన్ రెజ్లర్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహవీర్‌సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా 'దంగల్' చిత్రాన్ని తెరకెక్కించారు

దంగల్ అంటే మల్లయుద్ధం అని అర్థం
కాగా, నిజజీవితంలో ఆయనతో పాటు ఆయన కుమార్తెలు గీతా కుమారి ఫొగాట్, బబితా కుమారి ఫొగాట్ కూడా రెజ్లర్లే. స్వయంగా ఆయనే వారికి శిక్షణ ఇచ్చారు. దంగల్ అంటే మల్లయుద్ధం అని అర్థం. మహిళలు రెజ్లింగ్ క్రీడ వైపు రావడాన్ని అదోలా చూసే రోజుల్లో మహవీర్ సింగ్ ఫోగట్ తన ఇద్దరు కూతుళ్లు గీతా ఫోగట్, బబితా ఫోగట్ లను దేశం గర్వించదగ్గ మహిళా రెజ్లర్లుగా ఎలా తీర్చిదిద్దారు అనే కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. మహవీర్ సింగ్ ఫోగట్ పాత్రలో అమీర్ ఖాన్ నటించారు. నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రాన్ని అమీర్ ఖాన్ స్వయంగా నిర్మించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications