Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

400 మీటర్ల హర్డిల్స్ రేసులో అమెరికా రన్నర్ ప్రపంచ రికార్డు

Dalilah Muhammad breaks world record in 400 hurdles at nationals

హైదరాబాద్: మహిళల ట్రాక్ అండ్ ఫీల్డ్ 400 మీటర్ల హర్డిల్స్ రేసులో ప్రపంచ రికార్డు నమోదైంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌ అథ్లెటిక్స్ ట్రైల్స్‌లో భాగంగా డెస్ మొనిస్ డ్రాకే స్టేడియంలో జరిగిన 400 మీటర్ల హర్డిల్స్ రేస్‌ను అమెరికాకు చెందిన దలైలా మహ్మద్ 52.20 సెకన్ల టైమింగ్‌తో పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

ఈ క్రమంలో 29 ఏళ్ల దలైలా మహ్మద్ గత 16 ఏళ్లు వరల్డ్ రికార్డుని బద్దలు కొట్టంది. 2003లో రష్యన్ రన్నర్ యూలియా నెలకొల్పిన 52.34 సెకన్ల ప్రపంచ రికార్డును దలైలా ఈ సందర్భంగా అధిగమించింది. రియో ఒలింపిక్స్ మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో దలైలా మహ్మద్ స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే.

వరల్డ్ రికార్డు నెలకొల్పిన అనంతరం దలైలా మహ్మద్ మాట్లాడుతూ "ఇదొక అద్భుతమైన ఫీల్డ్, ఇక్కడ ఎలాంటి రికార్డులైన బద్దలవుతాయి. టాప్-3 స్పాట్స్ కోసం మేమంతా ఇక్కడ ఫోటి పడ్డాం. ట్రాక్‌పై మేంతా ఒకరినొకరు మానసికంగా, శారీరకంగా నెట్టివేస్తున్నాం. మా అందరికీ తెలుసు మా సత్తా ఏంటో, టాప్‌లో రావడమే మా లక్ష్యం" అని తెలిపారు.

Story first published: Monday, July 29, 2019, 18:40 [IST]
Other articles published on Jul 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+