అంధ్ర అమ్మాయి సంతోషికి కాంస్యం: బింద్రాకు స్వర్ణం
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మత్స సంతోషి కాంస్యం సాదించింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ చెందిన మత్స సంతోషి 53 కిలోల వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్యం సాదించింది. ఇంటర్ పూర్తి చేసిన మత్స అంతర్జాతీయ, జాతీయస్థాయిలో ఎన్నో పతకాలు సాధించింది.
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేటలో దూసుకుపోయింది. భారత్ మూడో స్వర్ణం గెలుచుకుంది. ఎయిర్ రైఫిల్‌లో భారత్ స్వర్ణం గెలుచుకుంది. 10 మీటర్లు ఎయిర్ రైఫిల్‌లో అభినవ్ బింద్రా బంగారు పతకం గెలుచుకున్నారు. ఇప్పటివరకు మొత్తం తొమ్మిది పతకాలు గెలుచుకుంది.
మూడు బంగారు పతకాలతోసహా ఆరు పతకాలను గెలుచుకుంది. కామన్వెల్త్ క్రీడల మొదటి రోజే భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. మూడు స్వర్ణ పతకాలు, నాలుగు రజిత పతకాలు, రెండు కాంస్య పతకాలు గెలుచుకుంది.

వెయిట్‌లిఫ్టింగ్ పురుషుల 56 కేజీల కేటగిరీలో సుఖేన్ డేకు స్వర్ణం, గణేష్ మాలికి కాంస్యం
వెయిట్‌లిఫ్టింగ్ మహిళల 48కేజీల విభాగంలో సంజిత ఖుముక్‌చామ్‌కు స్వర్ణం, మీరాబాయి చానుకు రజతం
జూడో పురుషుల 60 కేజీల విభాగంలో నవజోత్ చనాకు రజతం
జూడో మహిళల 48 కేజీల విభాగంలో సుశీల లిక్మాబామ్‌కు రజతం
జూడో మహిళల 52 కేజీల విభాగంలో కల్పన థోడెమ్‌కు కాంస్యం
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల ఈవెంట్‌లో.. మలైకా గోయెల్‌కు రజతం
10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అభినవ్ బింద్రాకు స్వర్ణం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications