Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏ పెనాల్టీ షూటౌట్‌లో భారత మహిళల హాకీ బలైందో.. అదే పెనాల్టీ షూటౌట్‌లో..!!

CWG 2022: India womens Hockey team beat New Zealand 2-1 in shootout to win a bronze

బర్మింగ్‌హామ్: బర్మింగ్‌హామ్ వేదికగా కొనసాగుతోన్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత జోరు కొనసాగుతోంది. పదో రోజూ వరుస పతకాలు వచ్చి భారత్ ఖాతాలో పడుతోన్నాయి. కీలకమైన ఈవెంట్లల్లో భారత క్రీడాకారులు ఏ మాత్రం నిరాశ పరచట్లేదు. అంచనాలకు అనుగుణంగా రాణిస్తోన్నారు. పతకాలను కొల్లగొడుతోన్నారు. బాక్సింగ్ బరిలో తిరుగులేదనిపించుకుంటోన్నారు. ఇదివరకు వెయిట్ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌లో అదే జోరు కనిపించింది.

హాకీలో రజతం..

ఇప్పుడిక తాజాగా హాకీలో భారత మహిళల జట్లు రజత పతకాన్ని అందుకుంది. సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ జట్టును 2-1 గోల్స్ తేడాతో మట్టి కరిపించింది. పెనాల్టీ షూటౌట్‌లో న్యూజిలాండ్‌ను ఓడించింది. 1-1 గోల్స్ తేడాతో సమవుజ్జీగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ అవసరమైంది. న్యూజిలాండ్ స్ట్రైకర్ల పెనాల్టీ షూటౌట్లను నిలువరించడంలో కేప్టెన్ కమ్ గోల్ కీపర్ సవిత పునియా మరోసారి తనకు తిరుగులేదనిపించుకున్నారు.

తొండాటతో..

తొండాటతో..

నిజానికి- తొలి సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా ఆడిన తొండాటకు మహిళల హాకీ జట్టు బలి అయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ను 3-0 తేడాతో ఓడిపోయింది. ఆస్ట్రేలియా పెనాల్టీ షూటౌట్‌ను గోల్ కీపర్ సవిత పునియా సమర్థవతంగా అడ్డుకున్నప్పటికీ.. అది రద్దయింది. టైమర్ స్తంభించిపోయిందనే కారణంతో రీటేక్ చేయాల్సి వచ్చింది. ఆ రీటేక్‌ను ఆస్ట్రేలియా గోల్‌గా మలచుకోగలిగింది. అదే సమయంలో తనకు దక్కిన అవకాశాలను పోగొట్టుకుంది.

హోరాహోరీ పోరులో..

ఆ పొరపాట్లకు రెండో సెమీ ఫైనల్స్‌లో ఎలాంటి అవకాశం ఇవ్వలేదు టీమిండియా విమెన్స్ హామీ ప్లేయర్లు. న్యూజిలాండ్ గోల్ కీపర్ కళ్లుగప్పి బంతిని గోల్ పోస్ట్‌లోకి మెరుపు వేగంతో పంపించగలిగారు. దీనితో 2-1 గోల్స్ తేడాతో టీమిండియా విజయం సాధించింది. మూడో స్థానంలో నిలిచి, రజత పతకాన్ని అందుకుంది. అంతకుముందు నార్మల్ టైమ్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా పోరాడాయి. ఒకరి గోల్ అవకాశాలను మరొకరు సమర్థవంతంగా అడ్డుకోగలిగారు. చెరో గోల్ సాధించి- సమవుజ్జీగా నిలిచారు.

 షూటౌట్‌లో న్యూజిలాండ్ అవుట్..

షూటౌట్‌లో న్యూజిలాండ్ అవుట్..

దీనితో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్‌లో న్యూజిలాండ్ స్ట్రైకర్ల దాడిని సవిత పునియా విజయవంతంగా అడ్డుకున్నారు. బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించడానికి చేసిన ప్రయత్నాలను వమ్ము చేశారు. ఆస్ట్రేలియాతో ఎదురైన చేదు అనుభవం నుంచి శరవేగంగా కోలుకుంది జట్టు. నార్మల్ టైమ్, పెనాల్టీ షూటౌట్‌లో సొనికా నవ్‌నీత్ కౌర్ గోల్స్ సాధించారు. నార్మల్ టైమ్‌లో న్యూజిలాండ్ డిఫెండర్ మెగాన్ హల్ గోల్ కొట్టారు. పెనాల్టీ షూటౌట్‌లో న్యూజిలాండ్.. గోల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Story first published: Sunday, August 7, 2022, 16:34 [IST]
Other articles published on Aug 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+