
హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్... దాదాపు 88 ఏళ్లుగా జరుగుతోన్న క్రీడా సంబరాలు. 12 రోజుల పాటు క్రీడాభిమానుల్ని ఓలలాడించేందుకు 21వ కామన్వెల్త్ గేమ్స్‌కు రంగం సిద్దమైంది. ఈసారి ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతున్నాయి. మొత్తం 71 దేశాలకు పైగా ఆరు వేల మంది పైచిలుకు క్రీడాకారులు ఈ గేమ్స్‌లో పాల్గొంటున్నారు.
బుధవారం అంగరంగ వైభవంగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంతో ఈ పోటీలకు తెరలేవనుంది. గురువారం అధికారికంగా పోటీలు ప్రారంభమవుతాయి. ఈ గేమ్స్‌లో మెరుగైన రికార్డు ఉన్న భారత్ ఈసారి 225 మంది అథ్లెట్లతో బరిలోకి దిగుతోంది. 1930లో మొదటిసారి ఆడిన భారత్ ఒకే ఒక్క కాంస్యంతో సరిపెట్టుకుంది.
ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 1958లో స్వర్ణాల ఖాతా తెరిచింది. మనం ఆతిథ్యమిచ్చిన ఢిల్లీ కామన్వెల్త్‌కు వచ్చేసరికి అంతర్జాతీయ స్థాయిలో భారత్ సత్తా చాటింది. 2010లో ఢిల్లీలో జరిగిన గేమ్స్‌లో 39 స్వర్ణాలతో ఏకంగా 2వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది గ్లాస్గో వేదికగా జరిగిన గేమ్స్‌లో భారత్ 15 స్వర్ణాలు సహా 64 పతకాలు గెలుచుకుంది.
భారత్ గత ఐదు అంచెల్లో టాప్-5లో చోటు నిలబెట్టుకుంటూ వస్తోంది. గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో మొత్తం 71 దేశాలు బరిలోకి దిగుతున్నాయి. 19 క్రీడాంశాల్లో పోటీలు.. 1500 పతకాల వేటలో వేలాది మంది అథ్లెట్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఓవరాల్‌గా భారత్ 17 క్రీడాంశాల్లో పోటీ పడుతోంది.
ఈసారి కూడా దాన్ని కాపాడుకోవడంతో పాటు గతేడాది కంటే ఎక్కువ పతకాలు నెగ్గాలని చూస్తోంది. ఈ కామన్వెల్తే గేమ్స్‌లో భారత్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. కరారా స్టేడియంలో జరిగే ఆరంభ వేడుకలకు భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు పతాకధారిగా మువ్వన్నెల జెండాతో మన బృందాన్ని ముందుండి నడిపించనుంది.
గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్లకు సులువైన డ్రా ఎదురైంది. దీంతో భారత దిగ్గజం మేరీ కోమ్ కామన్వెల్త్ తొలి పతకం అందుకునేందుకు ఒక్క విజయం సాధిస్తే చాలు. ఎందుకంటే మహిళల 48కేజీ విభాగంలో ఆమె నేరుగా క్వార్టర్స్‌లో ఆడబోతోంది. గెలిస్తే సెమీస్‌కు చేరుతుండగా కనీసం కాంస్యం సొంతమవుతుంది.
మరోవైపు పురుషుల విభాగంలో వికాస్ క్రిషన్ (75కేజీ)కు బై లభించడంతో నేరుగా ప్రీ క్వార్టర్‌ఫైనల్స్‌లో ఆడనున్నాడు. అలాగే ఈ గేమ్స్‌లో పతకాలు సాధించే జాబితాలో పీవీ సింధు, జీతూరాయ్, సైనా నెహ్వాల్, సుశీల్ కుమార్, వినేష్ ఫొగట్‌లు ఉన్నారు. గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో పలువురు అంతర్జాతీయ స్టార్ అథ్లెట్లు కూడా ఆకర్షణగా నిలవనున్నారు.
జమైకా టాప్ స్ర్పింటర్లు యొహాన్ బ్లేక్, ఎలైన్ థాంప్సన్, వరల్డ్ చాంపియన్ హర్డ్‌లర్ సాలీ పియర్సన్, బ్రిటిష్ డ్రైవర్ టామ్ దలే పతక రేసులో ఉన్నారు. అలాగే, మలేసియా దిగ్గజ షట్లర్ లీ చోంగ్ వీతో పాటు రియో ఒలింపిక్స్ స్వర్ణ విజేత, దక్షిణాఫ్రికా రన్నర్ కాస్టర్ సెమెన్యాల పోటీల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమం మధ్యాహ్నం 2.30 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్-2