Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కామన్వెల్త్ గేమ్స్: భారత్ ఖాతాలో మరో పతకం, నాలుగుకి చేరిన సంఖ్య

 CWG 2018: Deepak Lather wins Bronze medal in Men’s 69 kg weightlifting

హైదరాబాద్: ఆస్ట్రేలియానలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. శుక్రవారం జరిగిన పోటీల్లో పురుషుల 69 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన దీపక్ లాథర్ కాంస్య పతకం గెలిచాడు.

కామన్వెల్త్ గేమ్స్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హర్యానాకు చెందిన 18 ఏళ్ల దీపక్ లాథర్ ఈ విభాగంలో మొత్తం 295 కిలోల బ‌రువు ఎత్తి కాంస్యాన్ని కైవ‌సం చేసుకున్నాడు. స్నాచ్‌లో గరిష్టంగా 136 కిలోలు ఎత్తిన దీపక్.. క్లీన్ అండ్ జెర్క్‌లో 159 కిలోలు ఎత్తాడు. తాజా పతకంతో.. కామన్వెల్త్ 2018లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకి చేరింది.

ప్రస్తుతం భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకం ఉన్నాయి. ఇప్పటివరకు భారత్ సాధించిన నాలుగు పతకాలు వెయిట్ లిఫ్టింగ్‌లోనే కావడం విశేషం. రెండోరోజైన శుక్రవారం మహిళల 53 కేజీల విభాగంలో సంజితా చాను స్వర్ణం సాధించింది.

వెయిట్ లిఫ్టింగ్‌లో గురువారం కూడా భారత్‌కి రెండు పతకాలు వచ్చిన విషయం తెలిసిందే. మహిళల 48 కేజీల విభాగంలో పోటీపడిన మీరాబాయి చాను మొత్తం 196 కిలోలు ఎత్తి బంగారు పతకాన్ని గెలుపొందగా.. పురుషుల 56 కేజీల విభాగంలో పోటీపడిన గురురాజా రజతం సాధించాడు.

ఇదిలా ఉంటే వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు కాంస్య పతకం అందించిన దీపక్ లాథోర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Story first published: Friday, April 6, 2018, 14:19 [IST]
Other articles published on Apr 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+