Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కామన్వెల్త్: స్వర్ణంతో భారత్ బోణీ, మరో ఆరు మెడల్స్

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిరోజే భారత్ స్వర్ణ పతకంతో బోణీ చేసింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 48 కిలోల విభాగంలో కుము క్చమ్‌చాను సంజిత స్వర్ణ పతకం సాధించ గా, సయకొమ్ మీరాబాయ్ చాను రజత పతకాన్ని గెల్చుకుంది. మొదటి రెండు స్థానాలను భారత్ కైవసం చేసుకోగా, కాంస్య పతకాన్ని నైజీరియాకు చెందిన కెచి ఓపరా తన ఖాతాలో చేర్చుకుంది. సంజిత మొత్తం 173 కిలోల బరువునెత్తి సత్తా చాటింది.

మీరాబాయ్ 170 కిలోల బరువునెత్తింది. కాగా, అగ స్టీనా కెమ్ నవొకొలో 175 కిలోలతో నెలకొల్పిన కామన్వెల్త్ గేమ్స్ రికార్డును సమం చేసే అవకాశాన్ని సంజిత తృటిలో కోల్పోయంది. జూడోలో పతకాన్ని ఖాయం చేసుకున్న భారత్, బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ క్రీడల్లో ముందంజ వేసింది. నవ్‌జోత్ చానా, సుశీల లిక్మాబమ్ తమతమ విభాగాల్లో ఫైనల్ చేరడంతో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి.
మొత్తంగా తొలి రోజు ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఒక కాంంస్యంతో 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ శుభారంభం చేసింది.

పురుషుల 60 కిలోల విభాగంలో చానా కేవలం ఒక నిమిషం, 51 సెకన్లలోనే దక్షిణాఫ్రికాకు చెందిన డానియెల్ లె గ్రాంగ్‌ను చిత్తుచేశాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో బ్రెండన్ డోగ్‌ను ఓడించడానికి 3 నిమిషాల 49 సెకన్ల సమయం తీసుకున్న అతను సెమీ ఫైనల్‌లో గ్రాంగ్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. కాగా, మహిళల 48 కిలోల విభాగంలో సుశీల రెండు నిమిషాల 23 సెకన్లలో ఆస్ట్రేలియాకు చెందిన చ్లొయే రైనెర్‌పై గెలుపొంది ఫైనల్ చేరింది.

CWG 2014: Impressive India starts with 7 medals in Glasgow

అంతకు ముందు క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె ఆసీస్‌కే చెందిన అమీ మెయెర్‌ను ఓడించింది. కాగా, బాడ్మింటన్ గ్రూప్ 'బి'లో జరిగిన మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో 'పసికూన' ఘనాను 5-0 తేడాతో చిత్తుచేసింది.
పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ కేవలం 27 నిమిషాల్లోనే డానియల్ శామ్‌ను 21-6, 21-16 తేడాతో ఓడించాడు. మహిళల సింగిల్సలో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన టీనేజ్ సంచలనం పివి సింధు 21-7, 21-5 ఆధిక్యంతో స్టెల్లా అమాసాను చిత్తుచేసింది. పురుషుల డబుల్స్‌లో అక్షయ్ దివాల్కర్, ప్రణవ్ చోప్రా 21-7, 21-11 స్కోరుతో 22 నిమిషాల్లోనే ఇమాన్యుయెల్ డొన్కొర్, అబ్రహం అయేటీ జోడీని ఓడించి, భారత్‌కు తిరుగులేని రీతిలో 3-0 ఆధిక్యాన్ని అందించారు.

2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన జ్వాల గుత్తా, అశ్వినీ పొన్నప్ప అసాధారణ ఫామ్‌ను కొనసాగించి, మహిళల డబుల్స్‌లో ఇవెలిన్ బొట్వే, డియానా ఆర్చర్ జోడీని 17 నిమిషాల్లోనే ఓడించారు. చివరి మ్యాచ్‌లో భారత మిక్స్‌డ్ డబుల్స్ జోడీ పిసి తులసి, కిడాంబి శ్రీకాంత్ 21-5, 21-9 తేడాతో శామ్, అమాసా జోడీపై ఓడించి ఘనాపై భారత్ ఘన విజయాన్ని పూర్తి చేశారు. బాడ్మింటన్‌లో కనీసం నాలుగు పతకాలు సాధించే అవకాశాలున్న భారత్ మిక్స్‌డ్ టీం ఈవెంట్ తర్వాతి రౌండ్‌లో ఉగాండాను ఢీ కొంటుంది.

టేబుల్ టెన్నిస్ పురుషులు, మహిళల విభాగాల్లో భారత్ ఉత్తమ ప్రతిభ కనబరచింది. నాలుగేళ్ల క్రితం ఢిల్లీ కామన్వెల్త్‌లో రజత పతకాన్ని సాధించి సంచలనం సృష్టిచిన భారత మహిళల జట్టు ఈసారి విజయాలతో ప్రస్థానాన్ని ఆరంభించింది. షామినీ కుమరాసన్, మనికా బత్రా, మధురిక పట్కర్ వనుటూకు చెందిన తమతమ ప్రత్యర్థులను ఓడించారు. అదే విధంగా పురుషుల విభాగంలో బార్బడాస్‌తో పోటీపడిన భారత్ 3-0 ఆధిక్యంతో విజయం సాధించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+