For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కామన్వెల్త్: 13 ఏళ్ల చిన్నారి రికార్డ్, వారికెలా చెప్పాలని..

By Srinivas

గ్లాస్గో: స్కాట్లాండ్‌కు చెందిన ఎరేడ్ డేవిస్ అనే క్రీడాకారిణి రికార్డ్ సృష్టించింది. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న ఆమె 13 ఏళ్లకే మెడల్ సాధించి రికార్డ్ సృష్టించింది. ఆదివారం జరిగిన పోటీలో పాల్గొన్న ఎరేడ్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 2014 కామన్వెల్త్ ఆటలలో పాల్గొన్న క్రీడాకారుల్లో ఎరేడ్ అత్యంత పిన్నవయస్కురాలు.

అంతేకాదు, స్కాట్లాండ్ తరఫున ఇప్పటి వరకు పాల్గొన్న వారిలో ఆమె పిన్నవయస్కురాలు. ఈమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

మహిళల 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ పారా స్పోర్ట్స్ ఫైనల్లో ఆమె ఈ పతకం గెలుచుకుంది. ఒక నిమిషం 21.68 సెకండ్లలో ఆమె దీనిని సాధించింది. తన కూతురు కాంస్య పతకం సాధించడం పైన తండ్రి ఆనందం వ్యక్తం చేశాడు. తన కూతురు అత్యద్భుత ప్రతిభ కనబర్చిందన్నాడు.

ఇది చాలా కష్టమని, తన కూతురు ఈ ఫీట్ సాధించడం అద్భుతం, ఆశ్చర్యం అన్నాడు. ఆమె సాధించిన దానిని పైన ఇంతకు మించిన పదం లేదన్నాడు.

CWG 2014: 13-year-old girl wins bronze to set new Games record

కాగా, 1974లో న్యూజీలాండ్‌లో జరిగిన క్రిస్ట్ చర్చ్ గేమ్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన జెన్నీ టిరెల్ స్వర్ణం సాధించింది. ఇప్పుడు కాంస్యం సాధించిన ఎరెడ్... ఆమె కంటే రెండు నెలల చిన్న వయస్సులో కాంస్యం సాధించిందట.

కాంస్యం సాధించినందుకు తాను చాలాచాలా సంతోషపడుతున్నానని, ఈ వేడుక అద్భుతంగా ఉందని, అత్యంత పిన్న వయస్సులో ఈ మెడల్ సాధించినట్లు తనకు ఇప్పటి వరకు తెలియదని, ఇది చాలా అద్భుతం అని ఎరేడ్ పేర్కొంది. తాను కామన్వెల్త్ గేమ్స్‌లలో పాల్గొంటున్నట్లు తన స్నేహితులకు చెప్పలేదని పేర్కొంది.

ఎలా సాధించాలో తనకు తెలియదని అయితే, తన ప్రయత్నం తాను చేశానని ఎరేడ్ చెప్పింది. తాను పతకం సాధించిన సమయంలో తన అమ్మానాన్ని ఇక్కడే ఉన్నారని, తన తల్లిని తాను ఆనందంతో కౌగిలించుకున్నానని, తాను ఈ మెడల్‌ను పాఠశాలకు తీసుకు వెళ్లి నా స్నేహితులకు చూపిస్తానని చెప్పింది. తాను ఇక్కడకు వచ్చినట్లు వారికి తెలియదన్నది. ఇప్పుడు వారికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని తెలిపింది.

భారత్‌కు మరో పతకం

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు సోమవారం మరో పతకం లభించింది. టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో అచంట శరత్ కమల్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+