Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2030 CWG: కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్-భారత్‌లో శతజయంతి వేడుకలు..!!

భారతదేశానికి మరో అంతర్జాతీయ క్రీడా ఉత్సవానికి ఆతిథ్యం ఇచ్చే చారిత్రక అవకాశం దక్కింది. 2030లో జరగనున్న శతజయంతి కామన్వెల్త్ క్రీడలు (Centenary Commonwealth Games) నిర్వహణకు ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్ (Amdavad) ను అధికారికంగా ఖరారు చేశారు. 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు నిర్వహించిన తర్వాత, దాదాపు రెండు దశాబ్దాల అనంతరం భారత్‌కు దక్కిన అతిపెద్ద ప్రపంచ క్రీడా ఈవెంట్ ఇదే కావడం విశేషం.స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో 74 కామన్వెల్త్ సభ్య దేశాలు, భూభాగాల ప్రతినిధులు భారతదేశ బిడ్‌ను ఆమోదించారు.

ఆధునికతకు, క్రీడా సంస్కృతికి అద్దం
2030 క్రీడల కోసం భారతదేశం సమర్పించిన విజన్, అహ్మదాబాద్‌ను ఆధునిక, సాంస్కృతిక వైభవంతో కూడిన నగరంగా నిలబెట్టింది.ఈ క్రీడలు,2026 గ్లాస్గో క్రీడలు వేసే పునాదులపై నిర్మితమై, భారతదేశ యువత శక్తి,ఆశయంతో పాటు బలమైన క్రీడా సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పనున్నాయి.ఈ ప్రకటన వెలువడిన వెంటనే, జనరల్ అసెంబ్లీ హాల్‌లో సాంస్కృతిక ప్రదర్శన సందడి చేసింది. గ్లాస్గోలోని భారతీయ కమ్యూనిటీ సభ్యులతో సహా కామన్వెల్త్ అంతటా ఉన్న ఇరవై మంది గర్భా నృత్యకారులు, ముప్పై మంది భారతీయ ధోల్ డ్రమ్మర్లు ప్రదర్శన ఇచ్చారు. ఇది గుజరాత్ సంస్కృతిని, 2030లో అథ్లెట్లు అభిమానులు ఆశించే ఉత్సాహాన్ని ప్రతిబింబించింది.

confirmed-ahmedabad-to-host-2030-centenary-commonwealth-games-india-s-mega-sporting-push

'క్రీడలకు ఇదొక కొత్త స్వర్ణయుగం'
కామన్వెల్త్ స్పోర్ట్ అధ్యక్షుడు డాక్టర్ డొనాల్డ్ రుకరే మాట్లాడుతూ, అహ్మదాబాద్ ఎంపిక క్రీడలకు ఒక కొత్త, "సరికొత్త స్వర్ణయుగాన్ని" సూచిస్తుందని పేర్కొన్నారు.క్రీడల రీసెట్ తర్వాత, 74 కామన్వెల్త్ జట్లను స్వాగతించడానికి తామంతా 2026లో గ్లాస్గోకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత 2030 శతజయంతి క్రీడల కోసం అహ్మదాబాద్‌పై ఫోకస్ చేస్తామన్నారు.భారతదేశం విస్తృతి, యువత, ఆశయం, గొప్ప సంస్కృతి అపారమైన క్రీడా ఉత్సాహాన్ని తీసుకొస్తుందని పేర్కొన్నారు. 2034 క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి వివిధ దేశాలు బలమైన ఆసక్తిని చూపడం సంతోషకరమని చెప్పిన ఆయన...తమ తదుపరి శతాబ్దాన్ని ఉత్సాహంతో ప్రారంభిస్తున్నట్లు ఆయన అన్నారు.

15-17 క్రీడా విభాగాల ఎంపిక
2030 శతజయంతి కామన్వెల్త్ క్రీడల్లో 15 నుండి 17 క్రీడా విభాగాలను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అహ్మదాబాద్ 2030 బృందం కామన్వెల్త్ స్పోర్ట్ మరియు అంతర్జాతీయ సమాఖ్యల సహకారంతో స్థానిక స్పందన మరియు ప్రపంచ ఆకర్షణ రెండూ ఉండేలా ఒక ఉత్సాహభరితమైన స్పోర్ట్స్ ప్రోగ్రామ్‌ను రూపొందించనుంది.

పరిగణనలో ఉన్న క్రీడా విభాగాలు:
ఆర్చరీ, బ్యాడ్మింటన్, 3x3 బాస్కెట్‌బాల్ మరియు 3x3 వీల్‌చైర్ బాస్కెట్‌బాల్, బీచ్ వాలీబాల్, టీ20 క్రికెట్, సైక్లింగ్, డైవింగ్, హాకీ, జూడో, రిథమిక్ జిమ్నాస్టిక్స్, రగ్బీ సెవెన్స్, షూటింగ్, స్క్వాష్, ట్రయాథ్లాన్ మరియు పారా ట్రయాథ్లాన్, రెజ్లింగ్ ఉండే అవకాశం ఉంది. ఆతిథ్య నగరం అదనంగా రెండు కొత్త లేదా సాంప్రదాయ క్రీడలను కూడా ప్రతిపాదించవచ్చు.

2036 ఒలింపిక్స్ లక్ష్యంగా భారత్ ప్రయాణం
కామన్వెల్త్ గేమ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డాక్టర్ పి.టి. ఉష మాట్లాడుతూ, "కామన్వెల్త్ స్పోర్ట్ మాపై ఉంచిన నమ్మకానికి మేం కృతజ్ఞులం. 2030 క్రీడలు కామన్వెల్త్ ఉద్యమానికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగానే కాకుండా, తదుపరి శతాబ్దానికి పునాది వేస్తాయి" అని అన్నారు.

మోడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో, భారతదేశం అంతర్జాతీయ క్రీడా టోర్నమెంట్లను నిర్వహించడానికి గట్టి కృషి చేస్తోంది. దీనికి అంతిమ లక్ష్యం 2036లో వేసవి ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడమే. ఆ లక్ష్యం దిశగా దేశం ముందుకు సాగుతున్న క్రమంలో, రాజకీయ మరియు క్రీడా నాయకత్వం దేశవ్యాప్తంగా పటిష్టమైన క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి వరుసగా హై-ప్రొఫైల్ ఈవెంట్‌లను నిర్వహిస్తోంది. ఇటీవల భారత్ న్యూఢిల్లీలో పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు మరియు మొట్టమొదటి వరల్డ్ అథ్లెటిక్స్ ఇంటర్‌కాంటినెంటల్ టూర్‌ను నిర్వహించింది.

Story first published: Wednesday, November 26, 2025, 22:29 [IST]
Other articles published on Nov 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+