Commonwealth Games 2022 : నీతు ఘంఘాస్ పంచ్‌లకు మట్టికరిచిన ప్రత్యర్థి.. బాక్సింగ్లో గోల్డ్ కైవసం

కామన్వెల్త్ గేమ్స్ 2022లో మహిళల 48కేజీల ఫైనల్లో ఇంగ్లాండ్‌కు చెందిన డెమీ-జేడ్‌ను ఓడించి నీతు ఘంఘాస్ బాక్సింగ్‌లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్ అందించింది. కామన్ వెల్త్ గేమ్స్ ముగిసే ఒక్కరోజు ముందు నీతు విజయం సాధించి భారత జెండాను రెపరెపలాడించింది. ఇకపోతే నీతు విజయంతో భారత పతకాల సంఖ్య 41కి చేరుకుంది. ఇక ఫైనల్లో ఇంగ్లాండ్‌కు చెందిన డెమీ-జాడే రెజ్టాన్‌తో నీతు తలపడింది. సంపూర్ణ ఆధిపత్యం వహించిన నీతు అంపైర్ ఏకగ్రీవ నిర్ణయంతో విజయం సాధించింది.
పంచ్‌ల వర్షం కురిపించిన నీతు
ఫైనల్లో ఇంత సులువుగా నీతు గెలుస్తుందని ఎవరూ కూడా ఊహించలేదు. నీతూ అద్భుతమైన ఎటాకింగ్‌కు డెమీ-జాడే వద్ద అన్సర్ లేదు. నీతు పంచ్‌ల వర్షంతో డెమీ వణికిపోయింది. ఇకపోతే సెమీఫైనల్లో రిఫరీ స్టాప్స్ కాంటెస్ట్ విధానంలో కెనడాకు చెందిన ప్రియాంక ధిల్లాన్‌పై నీతు విజయం సాధించింది. నీతు ఓపెన్ గార్డ్‌తో ఆడడంతో పాటు తన స్ట్రెయిట్ జాబ్‌లు, కాంబినేషన్ పంచ్‌లను ఉపయోగిస్తూ ప్రత్యర్థిపై ప్రతాపాన్ని చూపించింది. చివరికి రిఫరీ పోటీని ముగించవలసి వచ్చింది. 48కేజీల విభాగంలో రెండుసార్లు జూనియర్ ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ కూడా నీతు గెలుచుకుంది.
ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు
ఇక బ్యాడ్మింటన్లో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన పీవీ సింధు తన తొలి కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్ స్వర్ణ పతకాన్ని గెలుచుకునేందుకు మరో ముందడుగు వేసింది. ఆదివారం జరిగిన సెమీ-ఫైనల్‌లో సింధు.. సింగపూర్‌కు చెందిన జియా మిన్ యోను వరుస గేమ్‌లలో ఓడించి మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. సింధు 21-19, 21-17 స్కోరుతో జియా మిన్పై విజయం సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో సింధు వరుసగా 3వ సారి సింగిల్స్ విభాగంలో పతకం తేబోతుంది. ఇక రజత పతకం తేస్తుందో లేక స్వర్ణమో వేచి చూడాలి.
16ఏళ్ల నిరీక్షణకు తెరదించిన వుమెన్స్ హాకీ టీం
కామన్వెల్త్ గేమ్స్ - 2022 మహిళల హాకీ ఈవెంట్లో భారత మహిళల టీం కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పెనాల్టీ షూటౌట్‌లో 2-1తో న్యూజిలాండ్‌ను భారత్ ఓడించింది. చివరి సారిగా భారత మహిళల టీం 2006లో మెల్‌బోర్న్‌లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించింది. ఇకపోతే సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొండాట వల్ల టీమిండియా భంగపడ్డ సంగతి తెలిసిందే. ఇక బ్రోంజ్ మెడల్ మ్యాచులో మాత్రం.. న్యూజిలాండ్‌ను ఇండియా సమర్థవంతంగా నిలువరించగలిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications