Commonwealth Games : వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లాల్రినుంగాకు అదిరిపోయే వెల్‌కమ్ చెప్పిన మిజోరం ప్రజలు

భారత వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లాల్రినుంగా కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. బర్మింగ్‌హమ్ నుంచి అతని స్వస్థలమైన మిజోరం రాష్ట్రంలోని ఐజ్వాల్‌కు రాగా అక్కడ స్థానికుల నుంచి భారీ ఎత్తున సాదర స్వాగతం లభించింది. పురుషుల 67కేజీల వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్లో 19ఏళ్ల జెరెమీ తన కెరీర్‌లో తొలి బంగారు పతకాన్ని సాధించి సత్తా చాటాడు. ఇక కామన్ వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ పతకం సాధించిన తొలి మిజోరం రాష్ట్ర అథ్లెట్‌గా నిలిచాడు. అతనికి స్వాగతం పలికేందుకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు, ఐజ్వాల్ విమానాశ్రయానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. స్వాగత కార్యక్రమంలో మిజోరం క్రీడల మంత్రి, మిజోరం ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రాబర్ట్ రొమావియా రాయ్ట్ పాల్గొని అభినందించాడు.
200 బుల్లెట్ బైకులతో సవారీ
తనకు ఐజ్వాల్లో లభించిన స్వాగతానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో జెరెమీ పంచుకున్నాడు. 'నాకు నా స్వస్థలంలో ఇంత సాదర స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మరింత కష్టపడి సాధన చేసి మన రాష్ట్రానికి, మన దేశానికి మరిన్ని అవార్డులు తెస్తాను.' అని పేర్కొన్నాడు. జెరెమీ లాల్రినుంగా ఓపెన్ టాప్ కారుపై తన చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ ప్రజలకు అభివాదం తెలుపుతూ కన్పించాడు. అతన్ని ప్రజలు కేరింతలు కొడుతూ అభినందించారు. ఇక అతని కారుకు ముందు ఏకంగా 200 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైకులతో రైడర్స్ సవారీ నిర్వహించారు.
కామన్‌వెల్త్ గేమ్స్‌లో సరికొత్త రికార్డు
ఇక కామన్ వెల్త్ గేమ్స్‌లో 67కేజీల విభాగంలో జెరెమీ స్నాచ్ ఈవెంట్‌లో 140కిలోల బరువెత్తి కొత్త రికార్డు సృష్టించాడు. అతను క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో మొత్తం 160కిలోలు ఎత్తాడు. ఇక టోటల్‌గా 300కిలోల గ్రాండ్ టోటల్‌తో స్వర్ణ పతకాన్ని అతను ఒడిసిపట్టాడు. 67కేజీల విభాగంలో కామన్ వెల్త్ గేమ్స్‌లో ఇది కొత్త రికార్డు. ఇకపోతే జెరెమీ తన చివరి ప్రయత్నంలో 165 కేజీలు ఎత్తే టైంలో కాస్త గాయపడ్డాడు. అయితే పెద్ద గాయమేమీ కాదు. అందువల్ల 165కేజీల లిఫ్టింగ్ పూర్తి చేయలేకపోయాడు
గత ఈవెంట్లోనూ గోల్డ్ మెడల్స్ ప్రదర్శన
మిజోరంలోని ఐజ్వాల్‌కు చెందిన 19ఏళ్ల యువకుడు అయిన జెరెమీ 2018 యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో 62కిలోల ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు. గత సంవత్సరం కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో 67కిలోల విభాగంలో అతను స్వర్ణం కూడా గెలుచుకున్నాడు. జాతీయ స్థాయి బాక్సర్ అయిన లాల్రినుంగా కుమారుడు జెరెమీ లాల్రిన్‌నుంగా. అతను తొలుత బాక్సింగ్ క్రీడ మీద మక్కువ చూపాడు. తర్వాత బాక్సింగ్ కాదని వెయిట్ లిఫ్టింగ్ వైపు తన ఫోకస్ మరల్చాడు. అందువల్ల వెయిట్ లిఫ్టింగ్లో ఇండియాకు మరో ఆశాకిరణంలా మారాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications