కామన్వెల్త్ గేమ్స్‌లో ప్రమాదం: తలకిందులుగా పడిన ఆటగాడు! (వీడియో)
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా జరిగిన పురుషుల టీమ్ జిమ్నాస్టిక్స్ ఫైనల్ పోటీలో ఇంగ్లాండ్ దేశానికి చెందిన గాబ్రియేల్ లాంగ్టన్ ఊహించని ప్రమాదానికి గురయ్యాడు. గాబ్రియేల్ లాంగ్టన్ పురుషుల టీమ్ ఫైనల్లో హై బార్ రొటీన్ ప్రదర్శన ఇస్తున్న సమయంలో బ్యాలెన్ కోల్పోయి బార్‌పై పట్టు జారి తలకిందులుగా.. తల, మెడ నేలకు తగిలేలా పడ్డాడు. వైద్య బృందాలు వెంటనే గాబ్రియేల్ లాంగ్టన్ కు చికిత్స అందించాయి. అతనికి కొద్దిసేపు చికిత్స అందించిన తర్వాత స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం క్రీడావర్గాల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.
ఆస్పత్రిలో గాబ్రియేల్ లాంగ్టన్‌కు పరీక్షలు, స్కాన్‌లు నిర్వహించగా.. ఎటువంటి తీవ్రమైన గాయాలు లేవని తేలింది. ముందు జాగ్రత్తగా గాబ్రియేల్ లాంగ్టన్ ను రాత్రికి రాత్రే ఆస్పత్రికి తరలించి.. అనేక స్కాన్లు నిర్వహించారని.. ఆయనకు ఎటువంటి తీవ్రమైన గాయాలు కాలేదని ఇంగ్లాండ్ జిమ్నాస్టిక్స్ జట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. సాయంత్రం ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి టీమ్ హోటల్‌కు తరలిస్తారని పేర్కొంది. ప్రమాదం నుంచి కోలుకున్న గాబ్రియెల్ లాంగ్టన్ మానసికంగా దృఢంగా ఉన్నాడని.. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ.. వైద్యం అందించిన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపినట్లు ఇంగ్లాండ్ జట్టు పేర్కొంది. త్వరలోనే తన సహచరులతో రజత పతక వేడుకల్లో పాల్గొనేందుకు అతను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.

జట్టులో మాక్స్ విట్‌లాక్ స్థానంలో గాబ్రియేల్ లాంగ్టన్
ఈ నెలలో గాబ్రియేల్ లాంగ్టన్‌ను ఇంగ్లాండ్ జట్టులోకి తీసుకున్నారు. మూడు స్వర్ణాలతో సహా ఆరు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న మాక్స్ విట్‌లాక్ స్థానంలో గాబ్రియేల్ లాంగ్టన్ జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా విట్‌లాక్ 2026 కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగాడు. ఇంగ్లాండ్ జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. ప్రమాదం కారణంగా లాంగ్టన్ పతక ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోయాడు. అతని సహచరులైన ల్యూక్ వైట్‌హౌస్, అలెక్స్ యోల్షిన్-క్యాష్, జోష్ నాథన్, ఆడమ్ టోబిన్ రజత పతకాన్ని గెలుచుకున్నప్పుడు అతను ఆసుపత్రిలో ఉన్నాడు. 2010 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత పురుషుల జిమ్నాస్టిక్స్ విభాగంలో ఇంగ్లాండ్ జట్టు స్వర్ణ పతకాన్ని గెలవడంలో విఫలమవడం ఇదే మొదటిసారి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

