
జులై 29 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్‌వెల్త్ గేమ్స్ - 2022లో మహిళల క్రికెట్ కప్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. CWG మహిళల టీ20 కప్ కోసం అన్ని జట్లు తమ జట్లను ప్రకటించాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్ భాగం కావడం ఇదే తొలిసారి. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో దక్షిణాఫ్రికా పురుషుల జట్టు గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆస్ట్రేలియా రజత పతకాన్ని కైవసం చేసుకోగా, న్యూజిలాండ్ కాంస్యం సాధించింది.
ఇక అప్పటి నుంచి క్రికెట్ టోర్నీని కామన్ వెల్త్ గేమ్స్‌లో మళ్లీ నిర్వహించలేదు. ఈసారి మహిళల టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ పోటీలో మొత్తం 8జట్లు పాల్గొంటాయి. ఆస్ట్రేలియా, బార్బడోస్, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు కప్ కోసం తలపడనున్నాయి. ఇందులో బార్బడోస్ మినహా... మిగతా జట్లన్నీ టాప్ క్లాస్ క్రికెట్ జట్లు కావడం విశేషం. CWG 2022: మహిళల క్రికెట్ జట్లు, జట్టు స్క్వాడ్లు
ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), రాచెల్ హేన్స్, డార్సీ బ్రౌన్, నికోలా కారీ, ఆష్లీ గార్డనర్, గ్రేస్ హారిస్, అలిస్సా హీలీ, జెస్ జోనాస్సెన్, అలానా కింగ్, తహ్లియా మెక్‌గ్రాత్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్, అనాబెల్ సదర్లాండ్, అమాండా-జెడ్‌ల్యాండ్, వెల్లింగ్టన్
బార్బడోస్: ఆలియా అలీన్, షానికా బ్రూస్, షాయ్ కారింగ్టన్, షాంట్ కారింగ్టన్, షామిలియా కానెల్, డియాండ్రా డాటిన్, కైలా ఇలియట్, ట్రిషన్ హోల్డర్, కైసియా నైట్, కైషోనా నైట్, హేలీ మాథ్యూస్, అలీసా స్కాంటిల్‌బరీ, షకెరా సెల్మాన్.
ఇంగ్లాండ్: హీథర్ నైట్ (కెప్టెన్), మైయా బౌచియర్, కేథరీన్ బ్రంట్, ఆలిస్ క్యాప్సే, కేట్ క్రాస్, ఫ్రెయా డేవిస్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, సారా గ్లెన్, అమీ జోన్స్, ఫ్రెయా కెంప్, నాట్ స్కైవర్, బ్రయోనీ స్మిత్, ఇస్సీ వాంగ్, డాని వ్యాట్.
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తనియా సప్నా భాటియా, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, జెమిమా రోడ్రిగ్స్, హర్లెన్ రాడ్రిగ్స్, రాధా యాదోల్ .
న్యూజిలాండ్: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇజ్జీ గేజ్, క్లాడియా గ్రీన్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, హేలీ జెన్సన్, ఫ్రాన్ జోనాస్, అమేలియా కెర్, రోజ్మేరీ మెయిర్, జెస్ మెక్‌ఫాడియన్, జార్జియా ప్లిమ్మర్, హన్నా తహు రోవ్,
పాకిస్థాన్: బిస్మాహ్ మరూఫ్ (కెప్టెన్), ఐమన్ అన్వర్, అలియా రియాజ్, అనమ్ అమీన్, అయేషా నసీమ్, డయానా బేగ్, ఫాతిమా సనా, గుల్ ఫిరోజా, ఇరామ్ జావేద్, కైనత్ ఇంతియాజ్, మునీబా అలీ సిద్ధిఖీ, నిదా దార్, ఒమైమా సోహైల్, సాదియా ఇక్బాల్, తుబా హసన్.
దక్షిణాఫ్రికా: సునే లూయస్ (కెప్టెన్), క్లో ట్రియోన్, అన్నెకే బాష్, త్రిష చెట్టి, నాడిన్ డి క్లర్క్, మిగ్నాన్ డు ప్రీజ్, లారా గూడాల్, షబ్నిమ్ ఇస్మాయిల్, సినాలో జఫ్తా, మారిజాన్ కాప్, అయాబొంగా ఖాకా, మసాబటా క్లాస్, నోంకులులేకో మ్లాబా, తుమీ, లారా వోల్వార్డ్ట్
శ్రీలంక: చమరి ఆటపట్టు (కెప్టెన్), హాసిని పెరెరా, హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, మల్షా షెహాని, నీలాక్షి డి సిల్వా, కవిషా దిల్హరి, అమ కాంచన, అచ్చిని కులసూర్య, ఇనోకా రణవీర, ఉదేశిక ప్రబోధని, సుగండిక, సుగండిక, సుగందిక అనుష్క సంజీవని