For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Commonwealth Games 2022 :ఇండియా షెడ్యూల్ ఇదే.. నీరజ్ చోప్రా, పీవీ సింధు, క్రికెట్ మ్యాచ్‌లు ఎప్పుడంటే..?

Commonwealth Games 2022: Indian Squad Complete Schedule at CWG

ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా కామన్‌వెల్త్ గేమ్స్ జులై 28నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్‌ 8వరకు కామన్ వెల్త్ గేమ్స్ జరుగుతాయి. ఈ ఈవెంట్ కోసం భారత్ నుంచి జంబో టీం బర్మింగ్‌హామ్‌కు బయలుదేరింది. మొత్తం 214మంది క్రీడాకారులతో కూడిని ఇండియా స్క్వాడ్ ఈ ఈవెంట్లో పాల్గొననుంది. 16విభాగాల్లో భారత క్రీడాకారులు పాల్గొంటారు. తొలిసారిగా వుమెన్స్ క్రికెట్ సైతం ఈ పోటీల్లో ఉండడం గమనార్హం. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం అందించిన నీరజ్‌ చోప్రా ఇనగురల్ సెర్మనీలో భారత కంటింజెంట్ ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్నాడు. నీరజ్‌ చోప్రా, పీవీ సింధు, మీరాబాయి ఛాను, నిఖత్ జరీన్ తదితర స్టార్ అథ్లెట్లు ఈ ఈవెంట్లో పాల్గొనబోతుండడంతో.. ఈసారి భారత్‌కు పతకాల పంట పండే అవకాశముంది. అయితే షూటింగ్ క్రీడా ఈసారి లేకపోవడంతో అది భారత్‌కు లోటే అని చెప్పాలి. వుమెన్స్ క్రికెట్‌, హాకీలలో టీమిండియా గోల్డ్ మెడళ్లు సాధించే అవకాశాలున్నాయి.

ఇకపోతే కామన్ వెల్త్ క్రీడల్లో భారత షెడ్యూల్‌ వచ్చేసింది. ప్రతిరోజు భారత్ క్రీడాకారులు వివిధ ఈవెంట్లలో పాల్గొంటారు. ఇక సోనీ నెట్ వర్క్‌లో ఈ పోటీలు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. తొలి పోటీ మిక్స్‌డ్ డబుల్స్ బ్యాడ్మింటన్ క్రీడలో జరగనుంది. ఇకపోతే షెడ్యూల్ మ్యాచ్‌లలో విజయం సాధించిన ప్లేయర్లు తర్వాతి రౌండ్లకు వెళతారు. తద్వారా భారత్ ఆడే పోటీల సంఖ్య భారీగా ఉండనుంది. ఇక షెడ్యూల్ ఓసారి పరిశీలిస్తే..

జులై 29 - బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ : అశ్విని పొన్నప్ప, సుమీత్‌ రెడ్డి
జులై 30: మెన్స్ మారథాన్ : నితేంధర్ రావత్‌
ఆగస్ట్‌ 2: మెన్స్ 3000మీ స్టీపుల్‌చేజ్‌ : అవినాశ్‌ సేబుల్‌, మెన్స్ లాంగ్‌ జంప్‌ : మురళీ శ్రీశంకర్‌, మహ్మద్‌ అనీస్‌, వుమెన్స్ 100మీ హర్డిల్స్‌ : జ్యోతి, వుమెన్స్ డిస్కస్‌ త్రో : నవ్‌జీత్‌ కౌర్‌
ఆగస్ట్‌ 3: బ్యాడ్మింటన్‌ వుమెన్స్ సింగిల్స్‌ : పీవీ సింధు, ఆకర్షి కశ్యప్‌, మెన్స్ బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ : లక్ష్య సేన్‌, కిదాంబి శ్రీకాంత్‌
ఆగస్ట్‌ 4: బ్యాడ్మింటన్‌ వుమెన్స్ డబుల్స్‌ : ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్‌, మెన్స్ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ : సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి
ఆగస్ట్‌ 5: మెన్స్ జావెలిన్‌ త్రో : నీరజ్‌ చోప్రా, డీపీ మను, రోహిత్ యాదవ్‌, మెన్స్ ట్రిపుల్ జంప్‌ : అబ్దుల్లా అబూబాకర్‌, ప్రవీణ్‌ చిత్రవేల్‌, ఎల్దోస్‌ పాల్‌, మెన్స్ 10కి.మీ రేస్‌ వాక్‌ : సందీప్‌ కుమార్‌, అమిత్‌ ఖత్రి, వుమెన్స్ లాంగ్‌ జంప్‌ : ఆన్సీ సోజన్‌, వుమెన్స్ జావెలిన్‌ త్రో : అన్నూ రాణి, శిల్పా రాణి, వుమెన్స్ హ్యామర్‌ త్రో : మంజు బాలా సింగ్‌, సరితా రోమిత్‌ సింగ్‌
ఆగస్ట్‌ 6: మెన్స్ 4X400మీ రిలే : అమోజ్‌ జాకబ్‌, నోవా నిర్మల్‌ టామ్‌, అరోకియా రాజీవ్‌, మహ్మద్‌ అజ్మల్‌, నాగనాథన్‌ పండి, రాజేష్‌ రమేష్‌, వుమెన్స్ 10కిమీ రేస్‌ వాక్‌ : భావన జాట్‌, ప్రియాంకా గోస్వామి, వుమెన్స్ 4X100మీ రిలే : హిమదాస్‌, ద్యుతీ చంద్‌, శ్రాబనీ నందా, ఎంవీ జిల్నా, ఎన్‌ఎస్‌ సిమి

వుమెన్స్ క్రికెట్‌:
జులై 29: భారత్‌ vs ఆస్ట్రేలియా, జులై 31: భారత్‌ vs పాకిస్థాన్, ఆగస్ట్‌ 3: భారత్‌ vs బార్బడోస్‌.

మెన్స్ హాకీ:
జులై 31: భారత్‌ vs ఘనా, ఆగస్ట్‌ 1: భారత్‌ vs ఇంగ్లండ్‌, ఆగస్ట్‌ 3: భారత్‌ vs కెనడా, ఆగస్ట్‌ 4: భారత్‌ vs వేల్స్‌

వుమెన్స్ హాకీ:
జులై 29: భారత్‌ vs ఘనా, జులై 30: భారత్‌ vs వేల్స్‌, ఆగస్ట్‌ 2: భారత్‌ vs ఇంగ్లండ్‌, ఆగస్ట్‌ 3: భారత్‌ vs కెనడా

బాక్సింగ్‌:
జులై 30: అమిత్‌ పంగాల్‌ (మెన్స్‌ 51 కేజీ), మహ్మద్‌ హుసాముద్దీన్‌ (మెన్స్‌ 57 కేజీ), శివ థాపా (మెన్స్‌ 63 కేజీ), రోహిత్‌ టోకాస్‌ (మెన్స్‌ 67 కేజీ), సుమిత్‌ కుందు (మెన్స్‌ 75 కేజీ), ఆశిష్‌ చౌదరి (మెన్స్‌ 80 కేజీ), సంజీత్‌ (మెన్స్‌ 92 కేజీ), సాగర్‌ (మెన్స్‌ 92+ కేజీ), నీతూ (వుమెన్స్‌ 48 కేజీ), నిఖత్‌ జరీన్‌ (వుమెన్స్‌ 50 కేజీ), జాస్మిత్‌ (వుమెన్స్‌ 60 కేజీ), లవ్లీనా బోర్గహైన్‌ (వుమెన్స్‌ 70 కేజీ)

వెయిట్‌లిఫ్టింగ్‌:
జులై 30: మీరాబాయి చాను (వుమెన్స్‌ 55 కేజీ), సంకేత్‌ మహదేవ్‌ (మెన్స్‌ 55 కేజీ), రిషికాంతా సింగ్‌ (మెన్స్‌ 55 కేజీ)
జులై 31: బింద్రాయనీ దేవి (వుమెన్స్‌ 59 కేజీ), జెరెమీ లాల్‌రినుంగా (మెన్స్‌ 67 కేజీ), అచింతా (మెన్స్‌ 73 కేజీ), ఆగస్ట్‌ 1: పాపీ హజారికా (వుమెన్స్‌ 64 కేజీ), అజయ్‌ సింగ్‌ (మెన్స్‌ 81 కేజీ),
ఆగస్ట్‌ 2: ఉషా కుమార (వుమెన్స్‌ 87 కేజీ), పూర్ణిమా పాండే (వుమెన్స్‌ 87+ కేజీ), వికాస్‌ ఠాకూర్‌ (మెన్స్‌ 96 కేజీ), రాగాల వెంకట్‌ రాహుల్‌ (మెన్స్‌ 96 కేజీ)

రెజ్లింగ్:
ఆగస్ట్‌ 5: బజరంగ్‌ పూనియా (మెన్స్‌ 65 కేజీ), దీపక్‌ పూనియా (మెన్స్‌ 86 కేజీ), మోహిత్‌ గ్రెవాల్‌ (మెన్స్‌ 125 కేజీ), అన్షు మాలిక్‌ (వుమెన్స్‌ 57 కేజీ), సాక్షి మాలిక్‌ (వుమెన్స్‌ 62 కేజీ), దివ్యా కాక్రన్‌ (వుమెన్స్‌ 68 కేజీ),
ఆగస్ట్‌ 6 : రవికుమార్‌ దహియా (57 కేజీ), నవీన్‌ (మెన్స్‌ 74 కేజీ), దీపక్‌ (మెన్స్‌ 97 కేజీ), పూజా గెహ్లోత్‌ (వుమెన్స్‌ 50 కేజీ), వినేష్‌ పోఘాట్‌ (వుమెన్స్‌ 53 కేజీ), పూజా సిహాగ్‌ (వుమెన్స్‌ 76 కేజీ)

Story first published: Monday, July 25, 2022, 22:48 [IST]
Other articles published on Jul 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+