Commonwealth Games : నాలుగో స్థానంతో ముగించిన భారత్.. షూటింగ్ ఉండుంటేనా..!

సోమవారం సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ద్వయం కామన్వెల్త్ గేమ్స్ 2022లో బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన డబుల్స్‌ను వరుస గేమ్‌లలో ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మూడు బ్యాడ్మింటన్ స్వర్ణ పతకాలు సాధించడం ఇదే తొలిసారి. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుంది. సాత్విక్ చిరాగ్‌లతో పాటు లక్ష్య సేన్, పీవీ సింధు స్వర్ణాలు సాధించడంతో బ్యాడ్మింటన్లో భారత్ భళా అనిపించింది.
పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ 7వ ర్యాంక్‌లో ఉన్న చిరాగ్, సాత్విక్‌సాయిరాజ్ జోడీ.. బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్ జోడీ బెన్ లేన్, సీన్ వెండీని 21-15, 21-13 తేడాతో ఓడించింది. గోల్డ్‌కోస్ట్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో రజతాన్ని సాధించిన ఈ జోడీ ఈసారి తమ స్వర్ణ కాంక్షను నెరవేర్చుకుంది. పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఇదే తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ పతకం.

నాలుగు పతకాలు అందించిన శరత్ కమాల్
సోమవారం పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్‌లో రెండో బంగారు పతకాన్ని అచంట శరత్ కమాల్ గెలుచుకున్నాడు. అతను సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్ లియామ్ పిచ్‌ఫోర్డ్‌ను 4-1తో ఓడించి స్వర్ణం సాధించాడు. అతను ఈ పతకంలో కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటివరకు 13పతకాలు సాధించాడు. ఇకపోతే బర్మింగ్ హామ్ కామన్ వెల్త్ గేమ్స్‌లో 40ఏళ్ల శరత్ 3గోల్డ్ మెడల్, ఓ సిల్వర్ మెడల్ సాధించాడు. తద్వారా అతనొక్కడే భారత్‌కు నాలుగు పతకాలు అందించాడు.
ఫ్లాగ్ బేరర్‌గా శరత్
అంతకుముందు పురుషుల సింగిల్స్ ప్లే ఆఫ్స్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన పాల్ డ్రింక్‌హాల్‌తో తలపడి టేబుల్ టెన్నిస్‌లో జి.సత్యన్ కాంస్యం సాధించాడు. సెమీఫైనల్‌లో సత్యన్ పిచ్‌ఫోర్డ్ చేతిలో ఓడిపోవడంతో అతను కాంస్యం మ్యాచ్ ఆడాల్సొచ్చింది. ఆదివారం జరిగిన గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత పురుషుల డబుల్స్ జోడీ అయిన సీనియర్ పాడ్లర్ మరియు జి సత్యన్.. ఇంగ్లాండ్ జోడీ పిచ్‌ఫోర్డ్, పాల్ డ్రింక్‌హాల్ చేతిలో ఓడిపోయింది. ఇక సత్యన్ ఆ ఓటమికి ప్రతీకారంగా డ్రింక్ హాల్‌పై గెలిచి సత్తా చాటాడు. ఇకపోతే ముగింపు వేడుకల్లో శరత్ కమాల్ భారత ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్నాడు.
రజతంతో సరిపెట్టుకున్న మెన్స్ హాకీ టీం
సోమవారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత పురుషుల హాకీ జట్టు ఓటమిపాలయి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్ 7-0 తేడాతో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఆసీస్ ప్లేయర్లు జాకబ్ ఆండర్సన్,నాథన్ ఎఫ్రామ్స్ బ్రేస్‌లతో అలరించగా.. టామ్ విక్హామ్, బ్లేక్ గోవర్స్, ఫ్లిన్ ఒగిల్వీ గోల్స్ చేసి ఆస్ట్రేలియ జట్టును గెలిపించారు. తద్వారా ఆసీస్ ఏడవ కామన్ వెల్త్ స్వర్ణాన్ని హాకీలో పొందింది. ఇకపోతే గోల్ కీపర్ శ్రీజేష్ సమర్థవంతంగా అడ్డుకోవడంతో గోల్స్ స్కోరు 7కు మాత్రమే పరిమితమైంది.
భారత్ సాధించిన పతకాలు
ఇకపోతే కామన్ వెల్త్ గేమ్స్ 2022లో భారత్ మొత్తంగా 61పతకాలు గెలుపొందింది. అందులో 22 గోల్డ్ మెడల్స్ కాగా.. 16సిల్వర్, 23బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఇక మెడల్స్ ట్యాలీలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. భారత్ కంటే ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక 2018 కామన్ వెల్త్ గేమ్స్‌లో 66పతకాలు సాధించి భారత్ మూడో స్థానంలో నిలిచింది. అయితే అప్పుడు షూటింగ్లోనే భారత్ 16పతకాలు గెలిచింది. అందులో 7 బంగారు పతకాలు. ఈసారి షూటింగ్ మిస్సయినా భారత్ 61పతకాలు సాధించి ఔరా అనిపించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications