Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Commonwealth games 2022 : 7వ రోజు ఇండియా షెడ్యూల్ ఇదే..! బరిలోకి దినేష్ కార్తీక్ భార్య దీపిక

Commonwealth games 2022 : Complete India Schedule On Day 7

కామన్వెల్త్ గేమ్స్‌లో ఆరో రోజు మెన్స్ హైజంప్ ఫైనల్స్‌లో తేజస్విన్ శంకర్ కాంస్యం గెలుపొంది.. తొలిసారి హైజంప్‌లో భారత్‌కు హైజంప్‌లో పతకాన్ని అందించాడు. ఇకపోతే భారత వుమెన్స్ హాకీ జట్టు తమ చివరి పూల్ A గేమ్‌లో కెనడాను ఓడించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. పూల్ బీలో మెన్స్ హాకీ జట్టు కూడా 8-0తో కెనడాను ఓడించింది. బాక్సర్ నీతు ఘన్‌ఘాస్ భారత్‌కు కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసింది. భారత వుమెన్స్ క్రికెట్ జట్టు తమ చివరి గ్రూప్ Aమ్యాచ్‌లో బార్బడోస్‌పై విజయం సాధించి సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. కామన్వెల్త్ గేమ్స్ ఏడో రోజున.. భావినా పటేల్, అమిత్ పంఘల్, దీపికా పల్లికల్ లాంటి స్టార్ క్రీడాకారులు మ్యాచ్‌లో పాల్గొననున్నారు. వారి నుంచి మంచి ప్రదర్శన కొనసాగాలని భారత బృందం ఆశిస్తోంది.

కామన్వెల్త్ గేమ్స్ 7వ రోజు పూర్తి భారత స్క్వాడ్ షెడ్యూల్
టేబుల్ టెన్నిస్ :
మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 64 (సనీల్ శెట్టి/రీత్ టెన్నిసన్ - 2 PM),
మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 32 (సతియన్ జ్ఞానశేఖరన్/మణికా బత్రా),
మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 32 (శరత్ కమల్/శ్రీజ ఆకుల),
వుమెన్స్ సింగిల్స్ రౌండ్ 32 (శ్రీజ ఆకుల vs TBD, మనికా బాత్రా vs TBD),
మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 32 (హర్మీత్ దేశాయ్/సనీల్ శెట్టి మరియు శరత్ కమల్ మరియు సత్యన్ జ్ఞానశేఖరన్)

అథ్లెటిక్స్
వుమెన్స్ హ్యామర్ త్రో క్వాలిఫైయింగ్ రౌండ్ గ్రూప్ A (సరితా రోమిత్ సింగ్, మంజు బాలా 2:30 PM),
వుమెన్స్ 200 మీటర్ల రౌండ్ 1 హీట్ 2 (హిమ దాస్, 3:03 PM),
మెన్స్ లాంగ్ జంప్ ఫైనల్స్ (మురళీ శ్రీశంకర్, 12 :12 AM)

పారా టేబుల్ టెన్నిస్
వుమెన్స్ సింగిల్స్ తరగతులు 3-5 గ్రూప్ 1 (భావినా పటేల్ 3:45 PM ),
వుమెన్స్ సింగిల్స్ తరగతులు 6-10 గ్రూప్ 1 (బేబీ సహానా రవి, 3:45 PM),
వుమెన్స్ సింగిల్స్ గ్రూప్ 3-5 గ్రూప్ 2 (సోనాల్బెన్ మనుబాయి పటేల్, 4:20 PM),
వుమెన్స్ సింగిల్స్ తరగతులు 3-5 గ్రూప్ 2 (రాజ్ అరవిందన్ అల్గర్, 5:30 PM)

లాన్ బౌల్స్ - మెన్స్ సింగిల్స్ (మృదుల్ బోర్గోహైన్ vs రాస్ డేవిస్ 4PM)
రిథమిక్ జిమ్నాస్టిక్స్ - వ్యక్తిగత అర్హత సబ్ డివిజన్ 1 (బావ్లీన్ కౌర్ 4:30 PM)

బాక్సింగ్ :
48-51కిలోల క్వార్టర్ ఫైనల్స్ (అమిత్ పంఘల్ సాయంత్రం 4:45),
67-70కిలోల క్వార్టర్ ఫైనల్స్ (జాస్మిన్ లంబోరియా, సాయంత్రం 6:15),
92కిలోల క్వార్టర్ ఫైనల్స్ (సాగర్ అహ్లావత్, రాత్రి 8),
63.5-67కిలోల క్వార్టర్ ఫైనల్స్ (రోహిత్ టోకాస్, 12:30 AM)

స్క్వాష్
వుమెన్స్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 32 (సునయన సారా కురువిల్లా 5:30 PM),
మెన్స్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 32 (సెంతికుమార్ వెలవన్, 6 PM),
మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16 (దీపికా పల్లికల్ / సౌరవ్ ఘోషల్, 7 PM),
మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16 (జోషనా చినప్ప / హరీందర్ పాల్, 11 PM),
వుమెన్స్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16 (జోషన చినప్ప / దీపికా పల్లికల్, 12:30 AM)

హాకీ
మెన్స్ పూల్ B (భారత్ vs వేల్స్ 6:30 PM)

Story first published: Thursday, August 4, 2022, 12:44 [IST]
Other articles published on Aug 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+