
ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో మూడో రోజు వెయిట్‌లిఫ్టర్లు జెరెమీ లాల్రినుంగా, అచింత షెవులీ 67కేజీలు, 73 కేజీల విభాగాల్లో భారత్‌కు గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన సంగతి తెలిసిందే. మూడో రోజు భారత మెన్స్ టేబుల్ టెన్నిస్ జట్టు సెమీ-ఫైనల్‌కు కూడా చేరుకుంది. మెన్స్ హాకీ జట్టు ఘనాను చిత్తుగా ఓడించింది. బ్యాడ్మింటన్‌లోనూ భారత్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పుడు అందరి దృష్టి నాలుగో రోజు (సోమవారం)పై ఉంది. భారత మెన్స్ హాకీ జట్టు ఇంగ్లాండ్‌తో ఢీకొనబోతుంది. బ్యాడ్మింటన్‌లో భారత మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించాలని చూస్తోంది.
కామన్వెల్త్ క్రీడల 4వ రోజు భారత్ పూర్తి షెడ్యూల్ ఇదే..!
* లాన్ బౌల్స్ (1 PM)-- వుమెన్స్ నాలుగు సెమీ-ఫైనల్స్
* వెయిట్ లిఫ్టింగ్ (2 PM)-- మెన్స్ 81 కేజీలు (అజయ్ సింగ్), వుమెన్స్ 71 కేజీలు (హర్జిందర్ కౌర్ 11PM)
* జూడో (2:30 PM) - మెన్స్ 66కేజీల ఎలిమినేషన్ రౌండ్ ఆఫ్ 16 (జస్లీన్ సింగ్ సైనీ vs మాక్సెన్స్ కుగోలా ఆఫ్ వనాటు),
మెన్స్ 60 కేజీల ఎలిమినేషన్ రౌండ్ ఆఫ్ 16 (విజయ్ కుమార్ యాదవ్ vs విన్స్లీ గంగయ),
వుమెన్స్ 48కేజీల క్వార్టర్ ఫైనల్స్ (సుశీల దేవీ వర్సెస్ బాన్‌ఫేస్),
వుమెన్స్ 57 కేజీల ఎలిమినేషన్ రౌండ్ 16 (సుచికా తరియాల్ vs రీటా రబిందా)
* స్విమ్మింగ్ (3:50PM) -
మెన్స్ 100మీ బటర్‌ఫ్లై హీట్ 6 (సజన్ ప్రకాష్),
మెన్స్ 100మీ బటర్‌ఫ్లై సెమీ-ఫైనల్ (సాజన్ ప్రకాష్, 12:27AM),
మెన్స్ 50మీ బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్ (శ్రీహరి నటరాజ్, 1:07AM)
* బ్యాడ్మింటన్ - మిక్స్‌డ్ టీమ్ సెమీ-ఫైనల్
* స్క్వాష్ (సాయంత్రం 4:30) - వుమెన్స్ సింగిల్స్ ప్లేట్ క్వార్టర్ ఫైనల్స్ (సునయన సారా కురువిల్లా వర్సెస్ టీబీడీ),
వుమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (జోషనా చినప్ప వర్సెస్ కెనడాకు చెందిన హోలీ నాటన్, సాయంత్రం 6),
మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (సౌరవ్ ఘోషల్ vs గ్రెగ్ లోబ్బన్ స్కాట్లాండ్, 6 :45 PM)
* బాక్సింగ్ (సాయంత్రం 4:45) -
48-51కిలోలు (రౌండ్ 16, అమిత్ పంఘల్ వర్సెస్ నమ్రీ బెర్రీ),
54-57కిలోలు (రౌండ్ ఆఫ్ 16, హుస్సాముద్దీన్ మహ్మద్ వర్సెస్ మహ్మద్ సలీం హొస్సేన్, సాయంత్రం 6),
75-80కిలోలు (రౌండ్ ఆఫ్ 16, ఆశిష్ కుమార్ vs ట్రావిస్ టపటూటోవా, 1AM)
* సైక్లింగ్ (6:32 PM) - వుమెన్స్ కైరిన్ మొదటి రౌండ్ (త్రియషా పాల్, సుశికళ అగాషే, మయూరి లూట్), మెన్స్ 40కి.మీ పాయింట్ల రేసు క్వాలిఫైయింగ్ (నమన్ కపిల్, వెంకప్ప కెంగళగుత్తి, దినేష్ కుమార్, విషజీత్ సింగ్, సాయంత్రం 6:52), మెన్స్ 100మి.మీ. టైమ్ ట్రయల్ ఫైనల్స్ (రొనాల్డో లైటోంజమ్, డేవిడ్ బెక్హాం, 8:02 PM), వుమెన్స్ 10కి.మీ స్క్రాచ్ రేస్ ఫైనల్ (మీనాక్షి, 9:37 PM)
* హాకీ (8:30 PM) -- మెన్స్ పూల్ బీ -- ఇండియా vs ఇంగ్లాండ్
* టేబుల్ టెన్నిస్ (11:30 PM) -- మెన్స్ సెమీ ఫైనల్ (భారత్ vs నైజీరియా)
* పారా స్విమ్మింగ్ (12:46 AM) - మెన్స్ 50మీటర్ల ఫ్రీస్టైల్ ఫైనల్ (నిరంజన్ ముకుందన్, సుయాష్ నారాయణ్, జాదవ్)