Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'మమ్మల్ని వాళ్లతో వెళ్లనివ్వండి'

Commonwealth Games 2018: IOA says Rajyavardhan Singh Rathore has assured to clear extra officials for upcoming event

హైదరాబాద్: 'సింధు, సైనాల వెంట వారి తల్లిదండ్రులు వెళ్లడానికి క్రీడా మంత్రిత్వ శాఖ ఎందుకు అనుమతించట్లేదో అర్థంకావడం లేదు. వారి ఖర్చులు ప్రభుత్వం భరించట్లేదు. అయినా సింధు, సైనాల మాదిరి కోహ్లి, సచిన్‌ కోరుంటే క్రీడా శాఖ వద్దనేదా?' అని బాత్రా మండిపడ్డాడు. సింధు తల్లి విజయ, సైనా తండ్రి హర్‌వీర్‌సింగ్‌ కామన్వెల్త్‌ క్రీడలకు వెళ్తున్నట్లు క్రీడా శాఖకు పంపించిన జాబితాలో ఐఓఏ పేర్కొంది.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

అందులో 222 మంది క్రీడాకారులు.. 106 మంది కోచ్‌లు, మేనేజర్లు, ఇతర సహాయ సిబ్బంది ఉన్నారు. వీరిలో 41 మందికి క్రీడా శాఖ నుంచి అనుమతి రాలేదు. మరోవైపు క్రీడా శాఖ తీరుపై సింధు, సైనాల తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. సింధు తల్లిదండ్రులు మాట్లాడుతూ.. 'చాలా టోర్నీలకు సొంత డబ్బులతో సింధుతో కలిసి వెళ్లా. ఈసారి కూడా సింధుతో కలిసి వెళ్ళేందుకు విజయకు అనుమతివ్వాల్సిందిగా బాయ్‌ను కోరాం. కొందరు తప్పుడు ప్రచారం చేస్తుండటం బాధ కలిగిస్తుంది' అని సింధు తండ్రి పి.వి.రమణ ఆవేదన వ్యక్తంజేశాడు.

సైనా తండ్రి ఆవేదన:
'నా సొంత ఖర్చులతో వెళ్తున్నా. గోల్డ్‌కోస్ట్‌లో నాకు తెలిసిన ప్రొఫెసర్‌ ఉన్నాడు. ఓ ప్రేక్షకుడిలా అక్కడికి వెళ్ళి క్రీడల్ని చూస్తా. రియో ఒలింపిక్స్‌కు వెళ్ళినప్పుడు కూడా అద్దె గదిలో ఉన్నా. మరి ఎందుకు ఇలాంటి వార్తలు వస్తున్నాయో అర్థంకావడం లేదు' అని సైనా తండ్రి హర్‌వీర్‌ తెలిపాడు. ఈ వివాదం మరింత ముదరక ముందే క్రీడా శాఖ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆ 41 మంది కామన్వెల్త్‌ క్రీడలకు వెళ్ళడానికి అనుమతిచ్చేందుకు క్రీడల మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్‌ రాఠోడ్‌ హామీ ఇచ్చినట్లు బాత్రా తెలిపాడు.

క్రీడాకారుల వెంట కుటుంబ సభ్యులు వెళ్లడం సరికాదని కామన్వెల్త్‌ క్రీడల సందర్భంగా పేర్కొన్నారు రాజ్యవర్థన్ సింగ్. ఈ విషయంలో క్రీడా మంత్రిత్వ శాఖపై భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరిందర్‌ బత్రా ఆగ్రహం వ్యక్తంజేశాడు. అగ్రశ్రేణి షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ల కుటుంబ సభ్యులు ఆస్ట్రేలియా వెళ్ళడంలో తప్పేముందని ప్రశ్నించాడు. వారి ఖర్చు ప్రభుత్వం భరించట్లేదని స్పష్టంచేశాడు.

Story first published: Friday, March 23, 2018, 8:26 [IST]
Other articles published on Mar 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+