హైదరాబాద్: గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే. తొలిరోజు వెయిట్ లిప్టింగ్ విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. పోటీలు ప్రారంభమైన తొలిరోజు గురువారం భారత వెయిట్ లిప్టర్లు మిరాబాయి చాను, గురురాజా పతకాలతో మెరిశారు.
కామన్వెల్త్ గేమ్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక, రెండో రోజైన శుక్రవారం భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. మహిళల 53 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన సంజిత చాను స్వర్ణం కైవసం చేసుకుంది. భారత్ ఇప్పటి వరకు గెలిచిన మూడు పతకాలు వెయిట్ లిఫ్టింగ్లోనే దక్కడం విశేషం. రెండు స్వర్ణాలు, ఒక రజతంతో భారత్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సంజితా చాను 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇక, పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్(12), ఆస్ట్రేలియా (15) అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే కామన్వెల్త్ గేమ్స్‌లో రెండో రోజు భారత షెడ్యూల్ ఇలా ఉంది.
కామన్వెల్త్లో శుక్రవారం భారత్ షెడ్యూల్:
బ్యాడ్మింటన్ (మిక్స్డ్ టీమ్ గ్రూప్-ఎ)
* భారత్ x స్కాట్లాండ్ ఉ. 9.30
* బాక్సింగ్ (పురుషుల రౌండ్ 16)
* నమన్ తన్వార్ x హరునా (టాంజానియా) ఉ. 9.00
* అమిత్ x సులేమాను టెటె (ఘనా) మ. 2.30
* హాకీ (మహిళలు) భారత్ x మలేసియా ఉ. 10.00
స్క్వాష్ ( సింగిల్స్ ప్రీక్వార్టర్స్)
* విక్రమ్ మల్హోత్ర x నిక్ మాథ్యూ (ఇంగ్లండ్) ఉ. 9.30
* జోష్న చినప్ప x టమికా సాబి (ఆస్ట్రేలియా) మ. 1.30
* దీపిక పల్లికల్ x అలిసా వాటర్స్ (ఇంగ్లండ్) మ. 1.30
వెయిట్ లిఫ్టింగ్
* మహిళల 53 కేజీ ఫైనల్ (సంజిత చాను) ఉ. 5.00
* పురుషుల 69 కేజీ ఫైనల్ (దీపక్ లాథర్) ఉ. 9.30
* మహిళల 58 కేజీ ఫైనల్ (సరస్వతి రౌత్) మ. 2.00