Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దీప్తికి సీఎం రేవంత్‌ భారీ బహుమతి.. రూ.కోటి నజరానాతో పాటు!

పారిస్ పారాలింపిక్స్‌‌లో కాంస్య పతకం నెగ్గిన తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజికి సీఎం రేవంత్ రెడ్డి భారీ నజరానా ప్రకటించారు. దీప్తికి రూ.కోటి నగదుతో పాటు గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే దీప్తి కోచ్‌ నాగపురి రమే‌ష్‌కు రూ.10 లక్షల నగదును అందివ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

మహిళల 400 మీటర్ల టీ-20 విభాగం ఫైనల్లో దీప్తి జీవాంజి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా, దీప్తి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామం. ఆమె నిరుపేద కుటుంబంలో మేధోపరమైన బలహీనతతో జన్మించింది.

CM Revanth Reddy Announces 1 Crore Reward for Paralympics Bronze Medalist Deepthi Jeevanji

పరుగు పందెంలో రాణించిన దీప్తిని స్కూల్ పీఈటీ ప్రోత్సహించాడు.ఆ తర్వాత ఇండియా జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ నాగపురి రమేశ్‌‌‌ శిక్షణతో ఆమె కథ మారిపోయింది. రమేశ్ ఆమెను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చి గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌‌‌‌‌‌‌‌) సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్పించారు. ఆ తర్వాత శిక్షణలో దీప్తి రాటుదేలింది.

కోచ్ రమేశ్ శిక్షణతో, పుల్లెల గోపించంద్ అండతో ఆమె పారా అథ్లెట్‌గా పతకాల వేట కొనసాగిస్తోంది. ఆసియా పారా గేమ్స్‌‌‌‌‌‌‌‌ 400 మీటర్ల ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో, వరల్డ్ పారా గ్రాండ్ ప్రీలోనూ 400 మీటర్లలో స్వర్ణాలు సాధించింది. వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా, వరల్డ్ రికార్డు హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పారిస్ పారాలింపిక్స్‌లో బరిలోకి దిగి కంచు మోత మోగించింది.

''కాంస్య పతకం గెలవడం సంతోషంగా ఉంది. కానీ బంగారు పతకం గెలవడమే నా లక్ష్యం. నాకు కాస్త అనారోగ్యంగా ఉండటం వల్ల పసిడి అందుకోలేకపోయాను. భవిష్యత్‌​లో బంగారు పతకం సాధిస్తా. నా కోచ్, తల్లిదండ్రులు నా విజయానికి పూర్తిగా సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. ఎనిమిదేళ్ల కఠోర శ్రమకు ఫలితం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ థ్యాంక్స్'' - దీప్తి జీవాంజి

Story first published: Saturday, September 7, 2024, 19:27 [IST]
Other articles published on Sep 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+