న్యూయర్క్: యుఎస్ ఓపెన్ మహిళా టైటిల్ ను బెల్జియం దేశానికి చెందిన కిమ్ క్లియస్టర్స్ గెలుచుకుంది. డెన్మార్క్ కు చెందిన కరోలిన్ వోజ్నాయకీపై ఫైనల్లోల 7-5, 6-3 స్కోరుతో విజయం సాధించి టైటిల్ ను దక్కించుకుంది. అన్ సీడెడ్ గా రంగంలోకి దిగిన క్లియస్టర్స్ పైనల్లో విజయం సాధించి తన సత్తాను చాటింది. పెళ్లయి, పిల్లను కని 18 ఏళ్ల తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన ఆ మహిళ రికార్డు సాధించింది. వొజ్నాయకీపై ఆమె 93 నిమిషాల పాటు పోరు సలిపింది. విజయం సాధించగానే 26 ఏళ్ల క్లియస్టర్స్ ఫ్యామిలీ బాక్స్ లోకి ప్రవేశించి మిత్రులను ఆలింగనం చేసుకుంది. భర్త బ్రెయిన్ ను ముద్దాడింది. 2005లో యుఎస్ ఓపెన్ ను ఆమె గెలుచుకుంది.నాలుగో రౌండులో ఈమె వీనస్ విలియమ్స్ ను మట్టి కరిపించింది.