అబాట్‌ను ఎవరూ తప్పు పట్టడం లేదని, అలా చేయాల్సి వస్తే మొత్తం క్రికెట్‌నే తప్పు పట్టాలి: క్లార్క్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం దైవ నిర్ణయమే తప్ప ఎవరూ కారణం కాదని ఆస్టేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ వ్యాఖ్యానించాడు. ఫిలిప్ హ్యూస్‌కు బౌన్సర్ వేసి ఆయన మరణానికి పరోక్షంగా కారణమైన బౌలర్ సీన్ అబాట్‌ను క్లార్క్ వెనకేసుకొచ్చాడు. అబాట్ మంచి భవిష్యత్తు ఉన్న ఆటగాడని, గతాన్ని మరచి ఆటపై దృష్టిని పెట్టాలని పిలుపిచ్చాడు.
అబాట్‌ను ఎవరూ తప్పు పట్టడం లేదని, అలా చేయాల్సి వస్తే మొత్తం క్రికెట్‌నే తప్పు పట్టాలని అన్నాడు. ఫిలిప్ హ్యూస్‌కు నివాళులు అర్పించే సమయంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్ పదే పదే ఏడుస్తూ కనిపిచాడు. అతను తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. వచ్చే వారం భారత్‌తో ఉన్న టెస్టు మ్యాచ్ గురించి మాట్లాడుతూ కూడా ఆయన ఉబికి వచ్చే కన్నీటిని నిలువరించుకోవడానికి ప్రయత్నించాడు.

ఆటగాళ్ల తరఫున క్లార్క్ సిడ్నీ క్రికెట్ మైదానంలో హ్యూస్‌ను నివాళి అర్పిస్తూ ప్రకటన చదివాడు. జట్టుగా తమకు జరిగిన నష్టాన్ని మాటల్లో వ్యక్తీకరించలేమని, తాము హ్యూస్ కళ్లలోని మెరుపును కోల్పోయామని క్లార్క్ అన్నాడు. ప్రపంచ ఈ వారం గొప్ప సహచరుడిని కోల్పోయిందని, దానికి తాము అన్నీ కోల్పోయిన పేదలమని ఆయన అన్నాడు.
తమ డ్రెసింగ్ రూం అప్పటిలా ఉండడం సాధ్యం కాదని, అతన్ని తాము ఎంతగానో ప్రేమించామని, ఎల్లవేళలా ప్రేమిస్తామని ఆయన అన్నాడు. హ్యూస్ గౌరవార్థం అతని అంతర్జాతీయ వన్డే జెర్సీ నెంబర్ 64ను ఇక మీదట ఎవరికీ కేటాయించబోరు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు క్లార్క్ ప్రకటించాడు. హ్యూస్ జెర్సీని రిటైర్ చేయాలని ప్రతిపాదించగా, క్రికెట్ బోర్డు అందుకు అంగకరించినట్లు ఆయన తెలిపాడు. హ్యూస్ ఆత్మకు శాంతి కలగాలని ఆయన అశించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications