శాప్ వేధింపులు: ఆర్చర్ జ్యోతి సురేఖ దీక్ష, ప్రభుత్వం దిగొచ్చి చర్చలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు ప్రోత్సాహకంగా ఇచ్చిన రూ. కోటిలో శాప్ అధికారులు కోత విధించడాన్ని నిరసిస్తూ ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ తలపెట్టిన దీక్ష వాయిదా వేసుకున్నారు. ఆమె తన ఆందోళనను విరమించుకోవడానికి గల కారణం ప్రభుత్వం చర్చలు జరపడమే.
విజయవాడలోని శ్రీనగర్ కాలనీలోని ఆమె నివాసానికి సోమవారం ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, శాప్ ఛైర్మన్ అంకమ చౌదరి వచ్చారు. అనంతరం ఆమెతో పాటు కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. జ్యోతి సురేఖ దీక్ష చేయడానికి గల కారణాలను అడగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెకు న్యాయం చేస్తామని, దీక్ష విరమించుకోవాలని సూచించారు.
కొందరు అధికారుల ఈ సమస్య తలెత్తిందని దీనిని సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ 'ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహకంగా ఇచ్చిన రూ.కోటి జ్యోతిసురేఖకు మాత్రమే చెందేలా ఉత్తర్వుల్లో మార్పులు చేస్తాం. గ్రూప్-1 ఉద్యోగం సహా ఇంటిస్థలం వెంటనే మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటాం' అని అన్నారు.
ఇక, శాప్ ఛైర్మన్ అంకమ చౌదరి మాట్లాడుతూ 'భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటాం' అని అన్నారు.

అసలేం జరిగింది?
అర్జున అవార్డు సాధించినందుకు జ్యోతి సురేఖకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ. కోటి నగదు ప్రోత్సాహాకాన్ని ప్రకటించింది. అందులో రూ.15 లక్షలను కోచ్ చెరుకూరి సత్యనారాయణకు ఇచ్చేలా శాప్ అధికారులు జీవో జారీ చేశారు. తనకు ప్రకటించిన ప్రోత్సాహకంలో కోత విధిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై జ్యోతి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

రూ.15 లక్షలను కోచ్‌కు ఇచ్చేలా జీవో జారీ
తన ప్రతిభను మెచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.కోటి ప్రోత్సాహకంగా ఇస్తే, శాప్ అధికారులు అందులో రూ.15 లక్షలను కోచ్‌కు ఇచ్చేలా జీవో జారీ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ విషయమై జ్యోతి సురేఖ మాట్లాడుతూ 2013లోనే చెరుకూరి సత్యనారాయణకు చెందిన ఓల్గా ఆర్చరీ అకాడమీ నుంచి బయటకు వచ్చేశానని చెప్పుకొచ్చింది.

కోచ్ కాదు... కేవలం వార్డన్ మాత్రమే
చెరుకూరి తనకు కోచ్ కాదని.. ఆయన కేవలం వార్డన్ మాత్రమేనని వెల్లడించింది. తనను సంప్రదించకుండా సత్యనారాయణను కోచ్‌గా శాప్ అధికారులు ఎలా నిర్ణయిస్తారని ఆమె ప్రశ్నించింది. క్రీడాకారులను సీఎం ప్రోత్సహిస్తున్నా శాప్ మాత్రం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.

వేధింపులకు దిగుతున్నారని జ్యోతి సురేఖ ఆవేదన
గతంలో క్రీడాకారులకు ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రోత్సాహకాన్ని యథాతథంగా అందిచేవారని.. ప్రస్తుతం శాప్‌లోని కొందరు ఉన్నతాధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. క్రీడాకారిణిగా తనకు శాప్ నుంచి కనీస ప్రోత్సాహం లేకపోగా.. వేధింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా చేస్తే భవిష్యత్తులో రాష్ట్రం తరపున ఎలా ఆడాలని ప్రశ్నించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications