కాలిఫోర్నియా: డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్, టీవీ నటి ఛయినా (46) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగానే ఆమె మృతి చెందిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఛయినా అసలు పేరు జోనీ లారెన్. కాలిఫోర్నియా రెడాండో బీచ్‌లోని అపార్టుమెంటులో ఛయినా తన బెడ్‌రూంలో విగతజీవిగా పడి ఉంది.
ఆమె విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన ఆమె స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించాడు. ఆమె ఇంట్లో పలు రకాల డ్రగ్స్ లభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇవేమీ నిషేధిత మందురు కావని, ఓవర్ డోస్ వల్లే ఛయినా మరణించి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

ఛయినా మాదక ద్రవ్యాలకు కూడా బానిస అయి గతంలో పునరావాస కేంద్రంలో చికిత్స తీసుకుంది. ప్లే బాయ్‌కు ఫోజులు ఇచ్చిన ఆమె.. టీవీ నటిగా ఎదిగింది. పోర్న్ స్టార్‌గా కొన్ని సినిమాలలో కూడా నటించింది. ఆమె బిజినెస్ మేనేజర్ ఆంథోనీ అంజాల్డో మాట్లాడుతూ... ఆమె తన అపార్టుమెంటులో మృతి చెందిందన్నారు.