Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అయ్యో పాపం! అండర్‌వేర్ లేకుండానే పరుగెత్తిన అథ్లెట్.. లైవ్‌లో షాకింగ్ దృశ్యం!

Ostrava Golden Spike Event: అమెరికన్ అథ్లెట్ క్రిస్ రాబిన్సన్ చెక్ రిపబ్లిక్‌లో జరిగిన ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ మీటింగ్‌లో 400 మీటర్ల హర్డిల్స్ రేసులో బట్టలు జారిపోవడంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఈ రేసును టీవీలో ప్రత్యక్షప్రసారం చేశారు. ఒస్ట్రావాలోని గోల్డెన్ స్పైక్ ఈవెంట్‌లో హర్డిల్స్ రేసులో క్రిస్ రాబిన్సన్‌కు ఇబ్బందికరమైన క్షణం ప్రత్యక్షప్రసారం అయింది. అతని వస్త్రధారణలో సమస్య కారణంగా రేస్ సమయంలో అతని ప్రైవేట్ భాగాలు షార్ట్ నుంచి బయటకు వచ్చాయి. 24 ఏళ్ల ఈ రేసర్ 400 మీటర్ల రేసులో 250 మీటర్లు మిగిలి ఉండగానే తన ప్రైవేట్ పార్ట్స్ అనుకోకుండా బయటకు కనిపించినప్పటికీ రేసులో విజయం సాధించాడు. రేసు లైవ్‌లో టెలికాస్ట్ అవుతోంది. క్రిస్ రాబిన్సన్ రేసులో ముందున్నందున కెమెరా అతనిపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది అతడిని ఆటపట్టిస్తున్నారు.

షార్ట్స్ సర్దుకుంటూనే పరుగెత్తాడు.. కానీ ఓడిపోలేదు..
మొత్తం పరుగు పందెం సమయంలో 24 ఏళ్ల క్రిస్ రాబిన్సన్ పదేపదే తన షార్ట్స్‌ను సర్దుకుంటూ కనిపించాడు. అదే సమయంలో క్రిస్ రాబిన్సన్ తన పోటీ వేగాన్ని కొనసాగించాడు. చివరి హర్డిల్‌ను దాటుకొని రేసులోని చివరి కొన్ని మీటర్లలో కూడా షార్ట్స్‌ను సర్దుకుంటూనే క్రిస్ రాబిన్సన్ 48.05 సెకన్ల సమయంతో ఈ ఈవెంట్‌లో విజయం సాధించాడు. ఫినిషింగ్ లైన్‌ను దాటిన తర్వాత రాబిన్సన్ నేలపై పడుకుని తన పోటీదారులను సిగ్గుపడుతూ చూశాడు. తన పరుగు ఈ విధంగా వార్తల్లో నిలుస్తుందని క్రిస్ రాబిన్సన్‌కు తెలుసు.

Chris Robinson faced a wardrobe malfunction Shocking Moment Caught Live

క్లోజ్-అప్ రీప్లే ప్రసారం.. కామెంటేటర్లు కూడా ఆశ్చర్యపోయారు..
ఈ మొత్తం ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షప్రసారం చేయబడింది. సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభం కాగానే.. గోల్డెన్ స్పైక్ ఈవెంట్‌ను కవర్ చేస్తున్న ప్రసారకర్తలు మిలియన్ల మంది ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. క్రిస్ రాబిన్సన్ విజయాన్ని రీప్లే చేసి మరీ చూపించారు. ఇందులో షార్ట్స్ నుంచి అతని ప్రైవేట్ భాగాలు బయటకు రాగా.. అతను కప్పుకోవడానికి విఫలయత్నం చేస్తున్నట్లు కనిపించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ వ్యాఖ్యాత టిమ్ హచింగ్స్ ఇలా అన్నారు. "ఇది అమెరికన్ అథ్లెట్ చేసిన అద్భుతమైన పరుగు. అతను నిరంతరం తన ప్రైవేట్ పార్ట్‌ను దాచడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో పరుగెత్తుతున్నాడు." అని కామెంటరీ కూడా చేశాడు.

Story first published: Thursday, June 26, 2025, 15:53 [IST]
Other articles published on Jun 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+