ఫిక్సింగ్ ఎఫెక్ట్: బస్ షెల్టర్లు క్లీన్ చేస్తున్న మాజీ క్రికెటర్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ క్రిస్ కెయిర్న్స్ తన కుటుంబం కోసం బస్ షెల్టర్లు క్లీన్ చేస్తున్నాడు. ఒకప్పుడు మూడో భార్య మెల్ క్రోసర్ కోసం ఖరీదైన 3.2 క్యారట్ల వజ్రాన్ని కొనుగోలు చేసిన క్రిస్ కెయిర్న్స్ ఇప్పుడు కుటుంబాన్ని పోషించేందుకు ఆక్లాండ్‌లో బస్ షెల్టర్లు క్లీన్ చేస్తున్నాడు.

క్రిస్ కెయిర్న్స్ పైన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అతనిపై న్యాయపరమైన విచారణ జరుగుతోంది. కోర్టు ఖర్చులు భారంగా మారాయి. బస్ షెల్టర్లు క్లీన్ చేసినందుకుగాను ఈ మాజీ క్రికెటర్‌కు గంటకు 17 డాలర్ల వరకు ఇస్తారు. దీనిపై క్రిస్ కెయిర్న్స్ మిత్రుడు, మాజీ క్రికెటర్ డియాన్ నాష్ మాట్లాడుతూ.. తన స్వేహితుడు స్తబ్దుగా ఉండకుండా ధైర్యంతో ముందడుగేశాడన్నాడు.
కుటుంబం కోసం కష్టపడి పని చేస్తున్నాడన్నాడు. తాను అతనికి మద్దతిస్తున్నానని చెప్పాడు. క్రిస్ కెయిర్న్స్ పేరు ఫిక్సింగ్ వ్యవహారంలో తెరపైకి రావడాన్ని ఓ స్నేహితుడిగా జీర్ణించుకోలేకపోతున్నానని, అయితే, దీని పైన విచారణ జరిగి పూర్తి అయ్యే వరకు ఏం చెప్పలేమన్నాడు. కెయిర్న్స్ నిర్ణయాన్ని క్రోసర్ కూడా సమర్థించింది. కుటుంబం కోసమే అతను పని చేస్తున్నాడని, తమకు సొంత ఇల్లు కూడా లేదని, అద్దె ఇంట్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications