Tokyo olympics 2021: నాన్ వెజ్ కుమ్ముడు మామూలుగా లేదుగా-భారత బృందం ఫుడ్ మెనూ ఇదే..!!

మరికొన్ని గంటల్లో టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.ఇప్పటికే అన్ని దేశాల నుంచి అథ్లెట్లు ఒలింపిక్ విలేజ్‌కు చేరుకున్నారు. ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశారు. అయితే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకకు భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరీందర్ బాత్ర డుమ్మా కొట్టనున్నాడు. ఆయన జపాన్‌కు వెళుతున్నారు కానీ.. ఆ సమయంకల్లా క్వారంటైన్‌లో ఉంటారని సమాచారం.
ఈ క్రమంలోనే ఆయన ఓపెనింగ్ సెరిమొనీకి హాజరు కారని తెలిసింది. అయితే పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో గేమ్స్ నిర్వహణపై నీలినీడలు అలుముకున్నాయి. అయితే ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇక ఒలింపిక్ స్టేడియంలో జరిగే ప్రారంభ వేడుకలకు ప్రతి జట్టు నుంచి ఆరుగురుకి మాత్రమే అనుమతించారు నిర్వాహకులు. ఇక క్వారంటైన్‌లో ఉంటున్నవారు కూడా ప్రారంభ వేడుకలకు హాజరుకారాదని సమావేశంలో నిర్ణయించారు.

మూడంతస్తుల భవనంలో...
ఒలింపిక్స్ గేమ్స్ సందర్భంగా క్రీడాగ్రామంలో భారత అథ్లెట్లకు మూడు అంతస్తులు ఉన్న భవనం ఇచ్చారు. 128 మందితో కూడిన భారత బృందంతో పాటు ఈ అంతస్తులో దక్షిణాఫ్రికా మరియు బెల్జియం అథ్లెట్లు కూడా షేర్ చేసుకోకున్నారు. అంటే ఈ రెండు దేశాలకు చెందిన క్రీడాకారులకు కూడా ఇదే అంతస్తులో బస చేయనున్నారు. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా ఫుట్ బాల్ ప్లేయర్లలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ట్రైనింగ్ సెషన్ రద్దు అయ్యింది. జట్టులోని మిగతా సభ్యులు క్వారంటైన్‌లోకి వెళ్లారు. జూలై 21 నుంచే ఫుట్‌బాల్, సాఫ్ట్‌బాల్ మరియు బేస్‌బాల్ లాంటి గేమ్స్ ప్రారంభం అయ్యాయి.
క్రీడాగ్రామంలో భారతీయ వంటకాలు
ఇక టోక్యో ఒలింపింక్ విలేజ్‌లో భారతీయ క్రీడాకారులు బసచేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉందని వారు చెప్పారు. అంతేకాదు ఆతిథ్యం పరంగా ఎలాంటి డోకా లేదని కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇక భారత క్రీడాకారుల ఆహార విషయానికొస్తే.. వీరికోసం చోలే భటూరే, నాన్, ఓక్రా, మరియు వంకాయలాంటి శాఖాహారం వడ్డిస్తున్నారట. ఇక మాంసాహారం విషయానికొస్తే ఎలాంటి సెలెక్టివ్ మెనూ లేదట. ఏదైనా తినేందుకు వెసులుబాటు కల్పించినట్లు సమాచారం.

ఆంక్షల సడలింపు
ఒలింపిక్స్ గేమ్స్ విలేజ్‌లో క్రీడాకారులు ఎక్కడైనా తిరిగేలా ఏర్పాటు చేశారు. కరోనా ఉందని ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని మాత్రమే బయటకు అడుగుపెట్టాలనే నిబంధన పెట్టారు.ఈ క్రమంలోనే భారత క్రీడాకారులు మాత్రం చాలా పరిమితంగా బయట తిరుగుతున్నట్లు సమాచారం.
చాలా జాగ్రత్తగా గేమ్స్ విలేజ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే శిక్షణా శిబిరం ఉన్న ప్రాంతం ఆ తర్వాత వక్రీడాకారులు బస చేస్తున్న ప్రాంతాల్లో మాత్రమే తిరుగుతున్నట్లు భారత ఒలింపిక్స్ సంఘం వెల్లడించింది. జూలై 23వ తేదీ నుంచే భారత క్రీడాకారులు తమ ఈవెంట్స్‌లో పాల్గొంటారు. ముందుగా ఆర్చరీ ఉంటుంది. అయితే మెడల్ ఈవెంట్స్ మాత్రం జూలై 24 శనివారం నుంచి ప్రారంభం అవుతాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications