గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్ చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ కు ముందు ఆమెతో కలిగి గడిపేందుకు.. ఏకంగా సూట్‌కేస్‌లోనే ఆమెను పెట్టి దొంగ చాటుగా టీమ్ డార్మిటరిలోకి తీసుకెళ్లాడు. ఈ విషయం బయటకు తెలియడంతో అతడు సస్పెండ్ కు గురయ్యాడు. ఇంతకీ అతడు ఎవరంటే?
ఇదీ జరిగిందీ
చైనీస్ బాస్కెట్ బాల్ ప్లేయర్ ఝాంగ్ జింగ్ లియాంగ్ (Zhang Xingliang) గత కొంతకాలంగో ఓ అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. అతడే తన గర్ల్ ఫ్రెండ్ ను సూట్‌కేస్‌లోనే పెట్టి తన టీమ్ డార్మిటరీలోకి ఎవరూ చూడకుండా దొంగచాటుగా తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని ఝాంగ్ గర్ల్ ఫ్రెండ్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను సూట్‌కేస్‌లోనే పడుకోవడంతో పాటు కొన్ని హోమ్ వర్క్ షీట్స్ తో ఉన్నట్లు ఫొటో దిగి పోస్ట్ చేసింది. కానీ ఆ తర్వాత ఆ పోస్ట్ ను వెంటనే డిలీట్ చేసింది. జనవరి 5న Qingdao Eaglesతో మ్యాచ్ ఉన్న సమయంలో ఝాంగ్ ఇలా చేసినట్లు తెలిసింది.

ఝాంగ్ ఎందుకు తీసుకెళ్లాడంటే?
ఈ విషయం బయటకు తెలిసిన తర్వాత ఝాంగ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న Guangzhou Loong Lions క్లబ్ అతడిని సస్పెండ్ చేసింది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో అతడి నుంచి వివరణ కోరింది. అయితే తన లవర్ కు హోమ్ వర్క్ విషయంలో హెల్ప్ చేసేందుకు, నైట్ స్టడీస్ కోసం అలా సూట్‌కేస్‌లో తీసుకెళ్లినట్లు తెలిపాడు ఝాంగ్.
ఈ విషయంపై క్లబ్ ఓ స్టేట్ మెంట్ ను రిలీజ్ చేసింది. "ఝాంగ్ తన వ్యక్తిగత విషయాల్ని, అనవసరమైన చర్యల ద్వారా తన ఫ్యాన్స్ , ఫ్రెండ్స్ దృష్టిని తనపై పడేలా చేశాడు. క్లబ్ మేనేజ్ మెంట్, కోచింగ్ స్టాఫ్ తో సంప్రదింపులు జరిపిన తర్వాత ఝాంగ్ ను బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నాం. అతడు ప్రారంభ మ్యాచ్ లకు దూరంగా ఉండేలా తక్షణమే చర్యలు తీసుకున్నాం. అతడు క్రమశిక్షణ చర్యలను, నిబంధనలు ఉల్లంఘించాడు" అని రాసుకొచ్చింది.
కాగా, ఝాంగ్ లూంగ్ లయన్స్ క్లబ్ తో కలిసి తన రెండో సీజన్ ఆడుతున్నాడు. ఈ సీజన్ లో అతడు ఇప్పటి వరకు 6.4 పాయింట్లు, 1.8 రీబౌండ్స్, 2.1 అసిస్ట్స్ తో 26 గేమ్స్ ఆడాడు. Qingdaoతో జరిగిన మ్యాచ్ లో 25 నిమిషాల పాటు ఆడిన అతడు, ఒక్క అసిస్ట్ లేకుండా 2 రీబౌండ్ లతో, 5 పాయింట్లు స్కోర్ చేశాడు.
On January 8, 2025, Chinese basketball player Zhang Xingliang from Guangzhou was suspended for violating club regulations after hiding his girlfriend in a suitcase and bringing her back to the dormitory to study English overnight before a game. pic.twitter.com/qnxtrADt8Q
— Share Chinese Douyin(TikTok) videos (@cz8921469_z) January 9, 2025