బ్రెజిల్: ప్రపంచానికి సాకర్ ఫీవర్ పట్టుకుంది. తమ అభిమాన జట్టు మ్యాచ్ చూసేందుకు అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు. మరికొందరు స్టేడియంలో హోరాహోరీ పోరాటాలు చూస్తూ మజా చేసుకుంటున్నారు.
తాజాగా చిలీ దేశానికి చెందిన ఓ జర్నలిస్ట్ తమ దేశ ఆటగాడు గోల్ కొట్టడంతో ఆ ఆనందం తట్టుకోలేక బ్రా విప్పి తన అందాలను చూపిస్తూ స్టేడియంలో అందర్నీ ఆశ్చర్యపరిచింది. చిలీ, బ్రెజిల్ జట్ల మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. అప్పటికే బ్రెజిల్ ఒక గోల్ సాధించి ముందంజలో వుంది.

ఈ తరుణంలో చిలీ ఆటగాడు అలెక్సిస్ సాంచెజ్ గోల్ చేసి బ్రెజిల్ ఆధిక్యాన్ని 1-1తో సమం చేసాడు. దీంతో స్టేడియంలో ఒకటే హోరు. అయితే ఒక్కసారిగా జర్నలిస్ట్ నునెజ్ తన టాప్ పైకెత్తి తమ జాతీయ జెండా రంగులతో రూపొందించిన తన బ్రాను ప్రదర్శిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది.
పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసిన ఆ మ్యాచ్‌లో చిలీ ఓడింది కానీ, గెలిస్తే తన ఆనందాన్ని ఇంకే తీరున వ్యక్తం చేసేదో చెప్పలేం. బ్రెజిల్ చిలీనీ 3-2 స్కోరుతో ఓడించింది. శనివారంనాడు ఈ మ్యాచు జరిగింది.