Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీఎం విజయ్‌తో ప్రజ్ఞానంద చెస్ గేమ్.. కొన్ని ఎత్తుల్లోనే చెక్‌మేట్! (వీడియో)

నార్వే చెస్ 2026 టోర్నీలో ప్రజ్ఞానంద చారిత్రాత్మక విజయం సాధించాడు. ఈ ఘనతను తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ అభినందించారు. చెన్నై సెక్రటేరియట్‌లో ప్రజ్ఞానందను మనస్ఫూర్తిగా అభినందించి.. ప్రజ్ఞానందకు సీఎం రూ. 50 లక్షల నజరానాను అందించారు. ఆయన ప్రతిభను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కొనియాడారు. ఈ భేటీలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. సీఎం విజయ్ స్వయంగా ప్రజ్ఞానందతో చెస్ ఆడారు. ఈ సరదా మ్యాచ్ ఇప్పుడు క్రీడారంగంలో హాట్ టాపిక్. దిగ్గజాలను ఓడించిన ప్రజ్ఞానంద, సీఎంను వేగంగా చెక్ మేట్ చేశారు. ఆ సమయంలో ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు.

చెస్ ఆడుతూ ప్రజ్ఞానంద ఆనందం

ఈ అనుభవంపై ప్రజ్ఞానంద మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు. "సీఎంతో చెస్ ఆడతానని నేను అస్సలు అనుకోలేదు. ఇది నాకు నిజంగా బిగ్ సర్‌ప్రైజ్" అని తెలిపారు. టేబుల్ పైనే చెస్ బోర్డు పెట్టి ఆడామని వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకం నాకు మరింత స్ఫూర్తినిస్తుందని ఆయన చెప్పారు.

Chess Prodigy Praggnanandhaa Checkmates TN CM Vijay Receives Rs 50 Lakh Reward Full Details

నార్వే చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద చారిత్రాత్మక రికార్డు

నార్వేలోని ఓస్లోలో జరిగిన ప్రతిష్టాత్మక నార్వే చెస్ 2026 టోర్నీలో ప్రజ్ఞానంద టైటిల్ కైవసం చేసుకున్నాడు. చివరి, పదో రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కైమర్‌ను ఓడించి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించాడు. వరుసగా నాలుగు క్లాసికల్ గేమ్స్‌లో విజయాలు సాధించి కెరీర్లోనే అతిపెద్ద టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా ప్రజ్ఞానంద సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్, అలీరెజా ఫిరౌజ్జా, వెస్లీ సో వంటి ప్రపంచ స్థాయి మేధావులు బరిలో నిలిచారు. వీరిందరినీ వెనక్కి నెట్టి చెన్నైకి చెందిన 20 ఏళ్ల ప్రజ్ఞానంద అగ్రస్థానంలో నిలిచాడు. ముఖ్యంగా ఈ టోర్నీలో నార్వే లెజెండ్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద రెండుసార్లు ఓడించడం చెస్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అద్భుతమైన విషయంగా నిలిచింది.

Story first published: Monday, June 8, 2026, 14:15 [IST]
Other articles published on Jun 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+