Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Chess Olympiad : ఇకపై ఆడేది లేదంటూ కరాఖండిగా చెప్పేసిన విశ్వనాథన్ ఆనంద్, కారణమిదే..!

Chess Olympiad : Vishwanathan Anand Gave Clarity About His Decision for not to Play

చెస్ ఒలింపియాడ్ టోర్నమెంట్‌ను రష్యా నుంచి భారత్లోని తన సొంత నగరమైన చెన్నైకి తరలించినప్పటికీ.. చెస్ ఒలింపియాడ్ టోర్నీలో ఆడకూడదనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని భారత దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ స్పష్టం చేశాడు. చెస్ ఒలింపియాడ్ ఆడాలనే విషయంలో పునరాలోచనకు తావు ఇవ్వడం లేదన్నాడు. జులై 28నుంచి ఆగస్టు 10 వరకు మామల్లపురంలో జరగనున్న చెస్ ఒలింపియాడ్‌కు భారత జట్టులోని యువకులకు మెంటార్‌గా ఉండటమే తనకు సంతోషంగా ఉందని తెలిపాడు. విశ్వనాథన్ ఆనంద్ 5సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత చెస్ ఒలింపియాడ్‌కు అతను మెంటార్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించాడు.

నా మనసు మార్చుకోవాలనుకోవట్లేదు

నా మనసు మార్చుకోవాలనుకోవట్లేదు

ఆనంద్ మాట్లాడుతూ.. 'లేదు.. నేను మళ్లీ చెస్ ఒలింపియాడ్ ఆడటం గురించి ఆలోచించట్లేదు. అది ఇండియాలో జరిగినా ఇంకెక్కడ జరిగినా నేను ఆడాలనుకోవడం లేదు. నేను నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను' అని 52ఏళ్ల ఆనంద్ పీటీఐతో తెలిపాడు. అలాగే తాను ఎందుకు ఆడాలనుకోవట్లేదో సహేతుకమైన కారణాలు కూడా ఆనంద్ తెలిపాడు. 'ప్రపంచ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో పాల్గొనడానికి అందుకు అర్హత సాధించడానికి కూడా నేను ప్రయత్నించడం లేదు. ఏదేమైనా నా మనసు మార్చుకోవాలనుకోవట్లేదు.

ఇండియాలో ఇప్పుడు చాలా మంది గొప్ప యువ చెస్ ప్లేయర్లు ఉన్నారు. అలాంటప్పుడు మనం ఎందుకు తిరిగి ఆడాలి. వారు చాలా బాగా రాణిస్తారని నేను ఆశిస్తున్నాను. వారు నా గైడెన్స్ కోసం సంప్రదించాలనుకుంటే నేను వాళ్లకు అందుబాటులో ఉండటానికి ప్రయత్నిస్తాను. నేను ఇప్పటికే కొంతమంది భారత జట్టు సభ్యులతో టచ్‌లో ఉన్నాను. నేను ఇప్పుడు ఉత్సాహభరితమైన గురువుగా ఉండాలనుకుంటున్నాను' అని ఆనంద్ చెప్పాడు.

భారత టీంపై అసలు ఒత్తిడి పడకూడదు

భారత టీంపై అసలు ఒత్తిడి పడకూడదు

ఒలింపియాడ్‌లో ఓపెన్ విభాగాల్లో మూడు భారత జట్లు, మహిళల ఈవెంట్‌లో మూడు జట్లు పాల్గొననున్నాయి. ఈసారి చాలా మంది క్రీడాకారులు భారతదేశం నుంచి పార్టిసిపేట్ చేస్తుండడంతో భారత్ గెలిచే అవకాశాల ఎక్కువగా ఉన్నాయి. ఇక స్వదేశంలో చెస్ ఒలింపియాడ్ జరుగుతున్నప్పటికీ.. భాతర టీంపై ఒత్తిడి పెంచకుండా ఉండటం చాలా ముఖ్యమని ఆనంద్ అన్నాడు. 'ఒత్తిడిని అనుభవించకుండా కూల్‌గా ఉండాలని మన టీం ప్లేయర్లకు గుర్తు చేస్తూ ఉండటమే ప్రధాన విషయం అని నేను భావిస్తున్నాను. చెస్ ఒలింపియాడ్ భారతదేశంలో జరగడం ఆనందంగా ఉంది. ప్లేయర్లు తాము ఒత్తిడికి గురికావడం వల్ల ఎలాంటి లాభం ఉండదు' ఆనంద్ చెప్పాడు.

ఏకంగా అన్ని జట్లు పోటీలో..

ఏకంగా అన్ని జట్లు పోటీలో..

ప్రతిష్టాత్మకమైన చెస్ ఒలింపియాడ్ 44వ ఎడిషన్‌లో ఓపెన్ విభాగంలో మొత్తం 188 జట్లు, మహిళల విభాగంలో 162జట్లు పాల్గొనబోతుండడం ఓ రికార్డు అనే చెప్పాలి. ఈ టోర్నీ గురించి ఆనంద్ మాట్లాడుతూ.. 'ఎట్టకేలకు ఈ ఒలింపియాడ్ ప్రారంభమవుతుంది. చాలా ఉత్సాహంగా ఉంది. ఇది చాలా పెద్దది. ఇలాంటి పెద్ద టోర్నీ జరగడం వల్ల ఈ టోర్నీ తాలుకూ గుర్తులు చాలా కాలం పాటు భారత్‌కు సానుకూల ప్రభావాన్ని చూపుతాయి' అని ఆనంద్ తెలిపాడు.

Story first published: Thursday, July 28, 2022, 19:02 [IST]
Other articles published on Jul 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+