Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంగీత్ అదిరిపోయే స్టెప్పులేసిన చెస్ గ్రాండ్‌మాస్టర్ హారిక ద్రోణవల్లి

Chess Grandmaster Harika Dronavalli sangeet ceremony at Hyderabad

హైదరాబాద్: చెస్ గ్రాండ్‌మాస్టర్ హారిక ద్రోణవల్లి ఆదివారం(ఆగస్టు 19న)న పెళ్లి పీటలెక్కుతోంది. హైదరాబాద్‌లో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరుగనుంది. ప్రముఖ వ్యాపారవేత్త, సివిల్‌ ఇంజినీర్‌ కార్తీక్‌ చంద్రను ఆమె పెళ్లాడుతోంది. పెళ్లికి ముందు ఆమె సంగీత్‌ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది.

ఈ సంగీత్ కార్యక్రమంలో పలువురు సన్నిహితులు, ఫ్రెండ్స్‌ ఆట పాటలతో సందడి చేశారు. పలువురు చెస్ క్రీడాకారులు సైతం ఈ సంగీత్‌కు హాజరయ్యారు. ఈ సంగీత్‌లో కాబోయే భర్త కార్తీక్‌ చంద్రతో కలిసి హారిక వేసిన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా, హారిక జనవరి 12న గుంటూరులో జన్మించింది.

చిన్నప్పటి నుంచే చెస్‌పై ఇష్టం పెంచుకున్న హారిక అద్భుతంగా రాణించింది. అండర్‌-9 నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించింది. ఆ తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో పతకాలు సాధించింది. 2008లో జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన హారిక.. 2011లో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) హోదా సంపాదించింది.

కామన్వెల్త్, ఆసియా చాంపియన్‌గా కూడా నిలిచిన హారిక 2012, 2015, 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు సాధించింది. కోనేరు హంపి తర్వాత గ్రాండ్‌ మాస్టర్‌ హోదాను పొందిన రెండో మహిళా క్రీడాకారిణి.

ద్రోణవల్లి హారిక ఇప్పటివరకు సాధించిన పతకాలు:
* గత ఏడాది ఇరాన్‌లో జరిగిన వరల్డ్ ఉమెన్స్ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో హారిక కాంస్య పతకం గెలిచింది.
* 2015లో ప్రపంచ మహిళల ఆన్‌లైన్‌ బ్లిట్జ్‌ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించింది.
* 2016లో చైనాలో నిర్వహించిన ఫిడే ఉమెన్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌లో స్వర్ణ పతకం సాధించింది.
* యూఏఈలో నిర్వహించిన ఉమెన్ ఆసియా టీమ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత ర్యాపిడ్‌ విభాగంలో స్వర్ణం పతకం దక్కించుకుంది.

Story first published: Saturday, August 18, 2018, 15:02 [IST]
Other articles published on Aug 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+