For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉత్తర కొరియా నుంచి 22మంది కోసం 229 మంది ఛీర్ గర్ల్స్

'Cheer Up!' North Korean Cheerleaders Rally Unified Women's Hockey Team During 8-0 Loss

హైదరాబాద్: క్రీడల్లో సాధారణంగా ఆటగాళ్లను ఉత్తేజపరచడానికి, ఉత్సాహపరచడానికి ఛీర్ గర్ల్స్ కనిపిస్తుంటారు. ఉత్తరకొరియా కూడా తమ దేశ ఆటగాళ్ల కోసం భారీ స్థాయిలో ఛీర్ గర్ల్స్‌ను పంపింది. కేవలం 22మంది క్రీడాకారుల కోసం 229 మందిని పంపడం గమనార్హం.

వింటర్(శీతాకాల ఒలింపిక్స్):
ప్రస్తుతం దక్షిణాకొరియాలో శీతకాల ఒలింపిక్స్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకే రకమైన దుస్తులు వేసుకొని ఛీర్ గర్ల్స్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. వాళ్లు ఈ ఒలింపిక్స్‌కే అందం తెచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందంతోనే కాదు మంచి మనసుతో మనమంతా ఒకటే అని చెబుతున్నారు.

పేరుకు రెండు దేశాలైనా ప్రజలంతా ఒకటే అని చాటుతున్నారు. తమ దేశాల క్రీడాకారులు గెలవాలని ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ రెండు దేశాలు కలిసి ఒకే హాకీ జట్టును బరిలోకి దింపడం ఇదే తొలిసారి.

ఉత్తర, దక్షిణ కొరియాల వివాదం:
పక్కపక్కనే ఉండే ఆ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఎప్పుడూ వాటి మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉంటాయి. ఆ దేశాల ప్రజలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. ఒకరంటే ఒకరికి పడదు. అవే ఉత్తర, దక్షిణ కొరియాలు. కానీ శీతకాల ఒలింపిక్స్‌ ఆ రెండు దేశాల ప్రజలను కలిపే ఆసక్తికర దృశ్యానికి వేదికైంది.

మైదానం దగ్గరే ఉండి ఛీర్ గర్ల్స్ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని ఇలా నింపుతారు. వారి మాటలు, పాటలు సంప్రదాయ శబ్దాలనే ప్రతిధ్వనిస్తుంటాయి. నిత్యం ఏదో ఒక శబ్ధాన్ని ఉచ్చరించే వాళ్ల మాటల అర్థాలు ఇలా..

గో టీమ్ (కలిసి పయనిద్దాం):
అందుకే వెళ్దాం. అందుకే కోసం వెళ్దాం. మన ఆటగాళ్ల గెలిచేందుకే వెళ్దాం. లేదా మన వాళ్లు విజేతలుగా నిలిచేందుకు వెళ్దాం. ఇటువంటి మాటలతో క్రీడాకారులను ఉత్సాహపరుస్తుంటారు.


నైస్ టు మీట్ యూ (మిమ్మల్ని కలవడం చాలా సంతోషం):

ఉత్తర కొరియా సంప్రదాయ ఉత్సవాల్లో భాగంగా పాడే పాటల్లో 'నైస్ టు మీట్ యూ' అనేది ఒక పాట. ఉత్తర కొరియా దేశంలో జరిగే సాంప్రదాయ ఉత్సవాల్లో పాడే పాటగా దక్షిణకొరియా దేశస్థులు పరిగణిస్తారు. చాలా కాలంగా విడిపోయిన ఇరు కొరియా దేశాలు ఈ వేడుకతో కలిశాయి. 1950లో జరిగిన యుద్ధం తర్వాత మళ్లీ ఉభయ దేశాలు కలవకపోవడంతో చాలా కాలం తర్వాత వినిపించడంతో ఈ పాటకు ఎక్కువ స్థాయిలో ప్రాముఖ్యత చోటు చేసుకుంది.

మై హోమ్ టౌన్ (నా సొంతూరు):
ఆటగాళ్లకు ఉత్సాహం కల్గించే విధంగా చీర్ గర్ల్స్ పాడే పాట్లో మై హోమ్ టౌన్ ఒకటి. ఇది ఉత్తర కొరియా దేశంలో జానపద గేయంగా ఆలపిస్తారు. దీనికి అర్ధం మా ఊరికి వసంతం వచ్చింది అన్నట్లుగా భావిస్తారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఉపాధి కూలీలు దీనిని ఎక్కువగా ఆలపించేవారు.

''నే పెరిగి పెద్దైన సొంతూరు ఇది

''కొండల్లో పూసే పువ్వులాంటిది

''చిన్న చిన్న మొగ్గలతో, అప్పుడే కలలకంటూన్న చిన్న పిల్లల నవ్వులాంటిది

''పొరుగింటి భవంతి పూలతో జటకట్టనున్నాయి

''నే ఆడిన చోట నా పేరు నిలిచిపోవాలి

మేమంతా ఒక్కటే. ఇది నిస్వార్థమైనది. మన జట్టును ఉత్సాహపరిచేందుకే వాళ్లు ప్రయత్నిస్తున్నారు. కలిసి పని చేద్దాం. జట్టుగా ఆడుకుందాం..అని దీనికి అర్థంగా పేర్కొనేవారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 12, 2018, 14:16 [IST]
Other articles published on Feb 12, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+