ఊహించిందే: గేల్ అసభ్యతపై వాట్సన్ కామెంట్
మెల్బోర్న్: వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ అనుచిత ప్రవర్తన ఊహించిందేనని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ అన్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా మాట్లాడిన గేల్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
గేల్ గురించి తెలిసినవారికి ఎవరికైనా ఆ సంఘటన ఆశ్చర్యం కలిగించదని, ఎందుకంటే ఇలాంటి రోజు ఒకటి వస్తుందని వారందరికీ తెలుసునని ఆయన అన్నారు. గేల్ ఆటను చూసేందుకు చాలా మంది మైదానాలకు వచ్చే మాట వాస్తవమేనని, అయితే క్రికెట్‌కు వెలుపల కూడా ఓ ప్రపంచం ఉంటుందనే విషయాన్ని గేల్ తెలుసుకోవాలని ఆయన అన్నాడు.

క్రీజులో ఉన్నప్పుడు ఎంత బాగా ఆడామన్నదే కాకుండా బయట ఎలా ప్రవర్తిస్తున్నామనేది కూడా ముఖ్యమని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. అభిమానులు క్రికెట్ ప్రపంచంలో వినోదాన్ని ఆస్వాదిస్తూనే అభిమానులు మైదానం వెలుపల సరైన ప్రవర్తన ఉంటేనే గౌరవిస్తారని అన్నారు.
క్రిస్ గేల్‌పై తాను చాలా సార్లు క్రికెట్ ఆడానని, క్రిస్ గేల్ ప్రవర్తన అతనికి చిక్కులు తెచ్చిపెడుతుందని అందరూ ఊహించిందేనని వాట్సన్ అన్నాడు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications