అందుకే: పిచ్చయ్యను సత్కరించిన బాబు (పిక్చర్స్)
హైదరాబాద్: తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న బాల్ బ్యాడ్మింటన్ దిగ్గజం పిచ్చయ్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్కరించారు. పిచ్చయ్యకు చంద్రబాబు నాయుడు రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఘనంగా సన్మానించారు.
అర్జున్ అవార్డు గ్రహీత అయిన పిచ్చయ్యకు ఇప్పుడు 96 యేళ్లు అని, ఆయన జాతీయ స్థాయిలో రాణించారని, జీవితాంతం క్రీడలను ప్రొత్సహించారని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అన్నారు. పిచ్చయ్య క్రీడాకారులకు స్ఫూర్తిగా మిగిలారని చంద్రబాబు కొనియాడారు.
అయితే ఈ వయసులో ఆయనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఇబ్బందులు పడుతున్నారని, దీంతో స్పందించామని, అందుకే పిచ్చయ్యను గౌరవించడమే కాకుండా ఆయనకు కొంతవరకైనా సహాయపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన రూ. 5 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.

పిచ్చయ్యకు సన్మానం
జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో చంద్రబాబు నాయుడు శుక్రవారంనాడు పిచ్చయ్యను సన్మానించారు.

స్ఫూర్తిదాయకం
పిచ్చయ్య సాగించిన కృషి భారత యువక్రీడాకారులకు స్ఫూర్తి అని చంద్రబాబు అన్నారు. జమ్మలమడుగు పిచ్చయ్య బాల్ బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు.

ఆయనకే సొంతం..
ప్రత్యర్థులను సైతం తన సమ్మోహన శక్తితో అభిమానులుగా చేసుకునే అసాధారణ ప్రతిభ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పిచ్చయ్యకే సొంతమని చంద్రబాబు అన్నారు.

పిచ్చయ్యను చూడడానికి..
పిచ్చయ్య ఆటను చూడడానికి మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారని, టికెట్ కొనుక్కుని ఆయన ఆటను తిలకించేవారని చంద్రబాబు అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications