హైదరాబాద్: ప్రపంచ కప్‌లో లీగ్ దశలో సెంచరీల మోత మోగింది. మంచినీళ్లు తాగినట్లుగా సెంచరీలు సాధించారు. శ్రీలంక వెటరన్ ఆటగాడు కుమార సంగక్కర లీగ్‌లో అత్యధికంగా నాలుగు సెంచరీలు చేసి రికార్డ్ సృష్టించాడు. ప్రపంచ కప్, వన్డేల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా సంగక్కర రికార్డ్ నెలకొల్పాడు.
వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ జింబాబ్వే పైన డబుల్ సెంచరీ చేసి మరో రికార్డ్ సృష్టించాడు.ప్రపంచకప్ లీగ్ దశలో మొత్తం 35 సెంచరీలు నమోదయ్యాయి. భారత జట్టులో శిఖర్ ధావన్ రెండు సెంచరీలు చేశాడు. బ్రెండన్ టేలర్ (జింబాబ్వే), దిల్షాన్ (శ్రీలంక), మహ్మదుల్లా (బంగ్లాదేశ్) రెండేసి శతకాలు చేశారు.
భారత్ తరఫున విరాట్ కోహ్లీ, సురేష్ రైనా ఒక్కో సెంచరీ చేశారు. లీగ్ దశలో చివరి రోజు ఐర్లాండ్ ఆటగాడు పోర్టర్ ఫీల్డ్, పాక్ క్రికెటర్ సర్ఫరాజ్ సెంచరీలు బాదారు. సెంచరీల వీరులు వీరే...

కుమార సంగక్కర - శ్రీలంక - 4 సెంచరీలు - 496 పరుగులు - అత్యధికం 124
టేలర్ - జింబాబ్వే - 2 - 433 పరుగులు - అత్యధికం 138
దిల్షాన్ - శ్రీలంక - 2 - 395 పరుగులు - అత్యధికం 161 నాటౌట్
మహ్మదుల్లా - బంగ్లాదేశ్ - 2 - 344 పరుగులు - అత్యధికం 128 నాటౌట్
శిఖర్ ధావన్ - భారత్ - 2 - 333 పరుగులు - అత్యధికం 137
డివిల్లీర్స్ - దక్షిణాఫ్రికా - 1 - 417 పరుగులు - అత్యధికం 162 నాటౌట్
అన్వర్ - యూఏఈ - 1 - 309 పరుగులు - అత్యధికం 106
ఆమ్లా - సౌతాఫ్రికా - 1 - 307 పరుగులు - అత్యధికం 159
తిరుమన్నె - శ్రీలంక - 1 - 291 పరుగులు - అత్యధికం 139 నాటౌట్
క్రిస్ గేల్ - వెస్టిండీస్ - 1 - 279 పరుగులు - అత్యధికం 2015
డుప్లెసిస్ - సౌతాఫ్రికా - 1 - 277 పరుగులు - అత్యధికం 109
పోర్టర్ ఫీల్డ్ - ఐర్లాండ్ - 1 - 275 పరుగులు - అత్యధికం 107
విరాట్ కోహ్లీ - భారత్ - 1 - 263 పరుగులు - అత్యధికం 107
గుఫ్తిల్ - న్యూజిలాండ్ - 1 - 261 పరుగులు - అత్యధికం 105
మాక్స్‌వెల్ - ఆస్ట్రేలియా - 1 - 257 పరుగులు - అత్యధికం 102
కోయెట్జర్ - స్కాట్లాండ్ - 1 - 253 పరుగులు - అత్యధికం 156
వార్నర్ - ఆస్ట్రేలియా - 1 - 243 పరుగులు - అత్యధికం 178
ఎడ్ జాయిసీ - ఐర్లాండ్ - 1 - 233 పరుగులు - అత్యధికం 112
మిల్లర్ - సౌతాఫ్రికా - 1 - 226 పరుగులు - అత్యధికం 138 నాటౌట్
రైనా - భారత్ - 1 - 212 పరుగులు - అత్యధికం 110 నాటౌట్
శామ్యూల్ - వెస్టిండీస్ - 1 - 194 పరుగులు - అత్యధికం 133 నాటౌట్
అలీ - ఇంగ్లాండ్ - 1 - 192 పరుగులు - అత్యధికం 128
ఫించ్ - ఆస్ట్రేలియా - 1 - 177 పరుగులు - అత్యధికం 135
రూట్ - ఇంగ్లాండ్ - 1 - 173 పరుగులు - అత్యధికం 121
సిమన్స్ - వెస్టిండీస్ - 1 - 161 పరుగులు - అత్యధికం 102
డుమినీ - సౌతాఫ్రికా - 1 - 133 పరుగులు - అత్యధికం 115 నాటౌట్
జయవర్ధనే - శ్రీలంక - 1 - 119 పరుగులు - అత్యధికం 100
సర్ఫరాజ్ - పాకిస్తాన్ - 1 - 150 పరుగులు - అత్యధికం 101 నాటౌట్