Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్: జింబాబ్వేకు అన్యాయం, క్యాచ్ పట్టి లైన్ తాకినా సిక్స్ కాలేదు!

హోబర్ట్: ప్రపంచ కప్‌లో మరో అంపైరింగ్ తప్పిదం దొర్లింది. జింబాబ్వే - ఐర్లాండ్ మధ్య శనివారం నాడు ఉత్కంఠ మ్యాచ్ జరిగింది. ఈ ఆసక్తికర మ్యాచ్‌లో ఐర్లాండ్ గెలిచింది. దూకుడుగా ఆడుతున్న సీన్ విలియమ్సన్ వివాదాస్పద రీతిలో పెవిలియన్ చేరాడు. ఐర్లాండ్ ఫీల్డర్ క్యాచ్ పట్టే సమయంలో బౌండరీ లైన్ తొక్కాడు. ఇది విమర్శలకు తావిస్తోంది.

ఐర్లాండ్ - జింబాబ్వే మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 331 పరుగులు చేసింది. 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే పోరాడింది.

చివరి ఓవర్లలో మ్యాచ్ మరింత ఉత్కంఠగా సాగింది. 19 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన స్థితిలో.. వివాదాస్పద స్థితిలో విలియమ్స్ ఔట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. కెవిన్ ఓ బ్రేన్ బౌలింగులో విలియమ్స్ భారీ షాట్ ఆడాడు.

Catch controversy hits World Cup as Sean Williams, Zimbabwe 'cheated'

బౌండరీ లైన్ వద్ద మూనీ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. కానీ అతడి పాదం లైన్‌కు అతి సమీపంలోకి వెళ్లింది. మూనీ పాదం లైన్‌ను తాకిందా లేద అన్నది తేల్చేందుకు అంపైర్లు విలియమ్స్‌ను ఆగమని చెప్పినట్లుగా కనిపించింది.

ఏం జరిగిందో తెలియదు. కానీ రీప్లే ప్రక్రియ పూర్తయ్యేలోపే విలియమ్స్ వెళ్లిపోయాడు. కొత్త బ్యాట్సుమెన్ పన్యంగర క్రీజులోకి వచ్చాడు. అతడు వచ్చినప్పటికీ రీప్లేలు చూపిస్తూనే ఉన్నారు. మూని పాదం బౌండరీ లైన్ తాకినట్లుగా కనిపించింది.

కానీ విలియమ్స్ వెళ్లి పోయాడు. అంపైర్లు దానిని సిక్స్‌గా ప్రకటించి ఉంటే అతను సెంచరీ పూర్తి చేయడమే కాకుండా.. జింబాబ్వే గెలిచేది కూడా! మ్యాచ్ అనంతరం జింబాబ్వే సారథి టేలర్ మాట్లాడుతూ.. అంపైర్ తప్పిదం వల్ల తాము ఓడిపోయామన్నాడు.

విలియమ్స్ 46.5 ఓవర్లో అవటయ్యాడు. అప్పటికీ జింబాబ్వే 300 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. విలియమ్స్ 96 పరుగులు చేశాడు. అది సిక్స్ అయి ఉంటే.. సెంచరీ దాటేది. కాగా, దీని పైన ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+