For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫైనల్లో మెకల్లమ్ చేదు రికార్డ్, ఏడు ఫైనల్స్‌లో ఆసిస్ రికార్డ్ ఇలా

By Srinivas

మెల్‌బోర్న్: ప్రపంచ కప్ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఫైనల్లో కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ పరుగులేమీ చేయకుండానే అవుటయ్యాడు. మూడు బంతులు ఆడిన మెకల్లమ్ (0) స్టార్క్ బౌలింగులో అవుటయ్యాడు.

ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు న్యూజిలాండ్ ఓటమి ఎరగలేదు. లీగ్ దశలో, క్వార్టర్లో, సెమీస్‌లో కివీస్ వరుసగా గెలిచింది. అందుకు తొలి పవర్ ప్లేలో మెకల్లమ్ చెలరేగడమే కారణమని చెప్పవచ్చు. దాదాపుగా గత అన్ని మ్యాచులలో మెకల్లమ్ చెలరేగాడు. ఈ ప్రపంచ కప్ పవర్ ప్లేలో కివీస్ సగటు 77గా ఉంది.

ఫైనల్లో మెకల్లమ్ డకౌ కావడంతో ఆ ప్రభావం జట్టుపై పడినట్లుగా కనిపిస్తోంది. ఆ తర్వాత వరుసగా రెండు వికెట్లు పడటంతో... కివీస్ ఆటగాళ్లు ఆచితూచి ఆడుతున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో పవర్ ప్లేలో కివీస్ స్కోరు 31 పరుగులు మాత్రమే.

Captain McCullum claims unwanted record in World Cup 2015 final

కివీస్ సారథి మెకల్లమ్ ఫైనల్ మ్యాచ్‌లో డకౌట్ కావడం ద్వారా చేదు రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడని, అయితే, ఇప్పటికీ మెకల్లమ్ ప్రపంచ కప్ పైన ఆశతో ఉన్నాడని ట్వీట్ చేశారు.

మరోవైపు, కివీస్ సారథి మెకల్లమ్ డకౌట్ అయినట్లుగా.. గత పది ప్రపంచ కప్ ఫైనల్లో ఏ కెప్టెన్ కూడా అవుట్ కాలేదు. గత పది ప్రపంచ కప్ ఫైనల్లలో ఎక్కువ పరుగులు చేసిన కెప్టెన్‌గా రికీ పాటింగ్ (140 పరుగులు నాటౌట్) ఉన్నాడు. అతను 2003లో భారత్ పై 140 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియా గత ఆరుసార్లు ప్రపంచకప్ పైనల్ చేరుకుంది. నాలుగుసార్లు విజేతగా నిలిచింది. ఫైనల్ ఆడటం ఇది ఏడోసారి. ఫైనల్ మ్యాచ్ అనేసరికి ఆసీస్ పట్టుదలగా ఆడుతుంది. బౌలర్లు కివీస్ బ్యాట్సుమెన్‌ను బంతులతో ఇబ్బంది పెడుతున్నారు. గత ఆరు ప్రపంచ కప్‌లలో ఆసీస్ పైన ప్రత్యర్థి జట్ల ఓపెనింగ్ భాగస్వామ్యం 21, 12, 12, 7, 4, 1గా ఉన్నాయి. ఇప్పుడు ఓపెనింగ్ భాగస్వామ్యం ఒకటి మాత్రమే.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+