For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

1880లోనే ఫుట్‌బాల్‌కు భారత్‌లో పునాదులు

By Pratap

చికాగో: ఫుట్ బాల్ ఒక ఆట మాత్రమే గానీ అందులో ప్రత్యర్థులు ఉండరు. క్రికెట్ పట్ల ఆసక్తి ఉండటంతో సహజంగానే దాని అభిమానుల్లో ఆసక్తిని పెంపొందిస్తుంది. కానీ క్రికెట్‌తో పోలిస్తే ఫుట్‌బాల్ భౌగోళికంగా సామాజిక, సాంస్క్రుతిక సంబంధాల విస్త్రుతికి సహకరిస్తుంది. యూరప్, సౌత్ అమెరికా దేశాల మద్య ఫుట్‌బాల్ ఆట అసాధారణ రీతిలో సాంస్ర్కుతికంగా, సామాజికంగా, రాజకీయ బంధం నెలకొల్పుకోవడంలో కీలక భూమిక పోషించింది.

లండన్ కేంద్రంగా పుస్తకాలు ప్రచురించిన రాటీస్ బుక్స్ పబ్లిషర్ ఆర్కా పాల్.. 33 వ్యాసాలతో 'టిరో - ఎ ఫుట్ బాల్ ఒడెస్సీ ఫ్రం అమజాన్ టు అల్ప్స్' పేరుతో పుస్తకం ప్రచురించాడు. ఈ నేపథ్యంలో ఆర్కా పాల్ ఫుట్‌బాల్.. భారత్‌లో దాని ప్రభావంపై ఓ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 18వ శతాబ్ది చివరిలోనే భారత్‌లో ఫుట్‌బాల్ ఆటకు పునాదులు పడ్డాయని ఆర్కాపాల్ తెలిపాడు. భారతీయ ఫుట్‌బాల్ చరిత్ర కొన్ని ఆధారాలు చూపుతున్నదన్నాడు. ఫుట్ బాల్ ఆడేందుకు క్రీడాకారుల్లో ఏడు అంశాల్లో క్వాలిటీ ఉండాలని పలు అధ్యయనాలు చెప్తున్నాయన్నాడు.

స్కిల్ తోపాటు స్పీడ్, శక్తి సామర్థ్యం, వ్యూహాత్మక, సంస్థాగత అభినందనలు, ప్రతిస్పందనలు కలిగి ఉండాలన్నాడు. యువతలో ప్రతిభను వెలికి తీసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) దేశవ్యాప్తంగా పలు క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసిందన్నాడు. కానీ అఖిల భారత్ ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) ఆ దిశగా ఇంకా ప్రయాణం ప్రారంభించలేదన్నాడు. ఒకవేళ ప్రొఫెషనలిజం వైఫల్యాన్ని సరిదిద్దగలిగితే భారత్ లో ఫుట్ బాల్ ఆట మరోసారి పైపైకి దూసుకెళ్తుందని ఆర్కాపాల్ విశ్వాసం వ్యక్తంచేశాడు.

'Calcutta, Bengalis intrinsically linked to evolution of Indian football'

1892లో ఇండియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ (ఐఎఫ్ఎ) ఆవిర్భవించిందన్నాడు. ఇది బెంగాల్/ భారత్ ఫుట్‌బాల్‌కు మార్గదర్శకత్వం వహిస్తోందన్నాడు. తాను బెంగాలీని కావడం యాద్రుచ్చికం అని వ్యాఖ్యానించాడు. 1880లోనే నాటి కలకత్తా వాసి నాగేంద్ర ప్రసాద్ శర్బాధికారి ఫుట్ బాల్ అసోసియేషన్ ఏర్పాటుకు చొరవ తీసుకున్నాడని, 1911లో ఈస్ట్ యార్క్ షైర్ రెజిమెంట్‌పై మొహున్ బగన్ ఆధ్వర్యంలో అథ్లెటిక్ క్లబ్ ఆఫ్ కలకత్తా జట్టు తొలి ఫుట్ బాల్ కప్‌ను గెలుచుకున్నదన్నారు.

అప్పట్లోనే అద్భుతమైన రీతిలో 80 వేల మంది అభిమానులు మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియంకు వచ్చారని ఆర్కాపాల్ గుర్తుచేశాడు. ఆ తర్వాత 1930ల్లో కలకత్తా లీగ్ చాలా పాపులరైందని వ్యాఖ్యానించాడు. కొద్దిమంది అణిముత్యాలంటి ప్లేయర్లను అందించిందని తెలిపాడు. తద్వారా కలకత్తా మైదాన్ నుంచి జాతీయ, స్వదేశీయ బ్రాండ్ 'బేర్ ఫుట్ సాకర్' ముందుకు వచ్చింది. 1948లోనే ఇండియన్ టీం.. డాక్టర్ టీ ఆవోవా సారధిగా అహ్మద్ ఖాన్, సైలిన్ మన్నా తదితరులతో కూడిన టీం ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిందని వివరించారు.

ఇలా భారత్‌లో ఫుట్‌బాల్ చరిత్ర ప్రారంభానికి కలకత్తాకు, బెంగాలీలకు అవినాభావ సంబంధం ఉన్నదన్నాడు. భారత్‌లో ఫుట్‌బాల్ వెనుకబడి పోవడానికి పలు కారణాలు, పరిణామాలు ఇమిడి ఉన్నాయన్నారు. భారత్ ఫుట్ బాల్ సుదీర్ఘ కాలంగా సుసంపన్న సంప్రదాయాలు, చరిత్ర కలిగి ఉన్నదని ఆర్కాపాల్ తెలిపాడు. అందువల్ల ఆసియా ఫుట్‌బాల్‌లోనే భారత్ టాప్ పొజిషన్‌కు చేరుకున్నదని, కానీ ఇది ఊహించడానికే కష్టంగా ఉందన్నాడు. బ్రిటిష్ వలస పాలన సమయంలో 1930 - 38 మధ్య కాలంలో భారతీయులు వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు దూరంగా ఉండేవారని వివరించాడు.

'1911లో ఐఎఫ్ఎ షీల్డ్ విక్టరీ తర్వాత బ్రిటిష్ అధికారుల వైఖరితో మొహున్ భగన్ వంటి వారు తమ ఉత్సుకతను బయటపెట్టుకునేందుకు భయపడేవారో ప్రముఖ ఫుట్ బాల్ కోచ్ అమల్ దత్తా గుర్తుచేశాడు' అని అర్కాపాల్ చెప్పాడు. భారత్ తరఫున ప్రాతినిధ్యం కల్పిస్తూ జట్టు ఏర్పాటును నిరుత్సాహ పరిచే వారన్నాడు. ప్రత్యేకించి 50 నిమిషాల నిడివి గల మ్యాచ్‌ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. 1970ల్లో గానీ దేశీయ పోటీల్లో ఈ ఫార్మాట్ ను 90 నిమిషాల ఫార్మాట్ గా మార్చారని వివరించాడు. భారతీయులకు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడగల సామర్థ్యం లేదనే చర్చ జరిగేదన్నాడు. అందుకు 1956లో యుగొస్లెవియాపై ఒలింపిక్ సెమీ ఫైనల్స్ మ్యాచ్ ఉదంతం అందుకు నిదర్శనమన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+