Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బక్నర్ ఔట్: బజ్జీకి లైన్ క్లియర్

Billy Bowden
సిడ్నీ: ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) భారత క్రికెట్ నియంత్ర మండలి (బిసిసిఐ) ఒత్తిడికి తల వంచింది. పెర్త్ టెస్టు నుంచి అంపైరింగ్ బాధ్యతల నుంచి బక్నర్ ను తొలగించేందుకు ఐసిసి అంగీకరించి ఆయనకు ఉద్వాసన పలికింది. బక్నర్ స్థానంలో న్యూజిలాండ్ కు చెందిన బిల్లీ బౌడెన్ కు అంపైరింగ్ బాధ్యతలు అప్పగించారు. బక్నర్ తప్పుడు నిర్ణయాల వల్ల భారత్ సిడ్నీ టెస్టులో భారత్ ఓటమి పాలు కావాల్సి వచ్చింది. అస్ట్రేలియా ఆటగాళ్ల తీరుపై, బక్నర్ తప్పుడు నిర్ణయాలపై సర్వత్రా నిరసన వెల్లువెత్తింది. పెర్త్ టెస్టు నుంచి అంపైర్ బక్నర్ ను తొలగించాల్సిందేనని బిసిసిఐ పట్టు పట్టింది.

అలాగే హర్బజన్ సింగ్ పై విధించిన నిషేధం విషయంలో కూడా ఐసిసి వెనక్కి తగ్గింది. హర్బజన్ కు విధించిన నిషేధం అమలును వాయిదా వేసింది. దీంతో పెర్త్ టెస్టు ఆడడానికి హర్బజన్ కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. హర్బజన్ పై నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిసిసిఐ తదుపరి భారత జట్టు పర్యటనను రద్దు చేసుకునే దాకా వెళ్లింది. సిడ్నీ నుంచి కదలకూడదని బిసిసిఐ భారత ఆటగాళ్లను ఆదేశించింది. దీంతో ఆస్ట్రేలియా పర్యటన సందేహంలో పడింది
Story first published: Tuesday, January 8, 2008, 12:17 [IST]
Other articles published on Jan 8, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+