న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'పతకాన్ని గెలిచినా.. పట్టించుకునే వారు రాలేదు'

Bronze medallist Nithya Ramesh returns home to no recognition – except on Facebook

హైదరాబాద్: అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పతకాన్ని సాధించి దేశ ప్రతిష్ఠను ఇనుమడింపచేసిన ఆ యువ క్రీడాకారిణి.. ఎన్నో ఆశలతో స్వదేశం చేరితే కనీసం స్వాగతం పలకడానికి కూడా ఎవరూ రాలేదు. బెంగళూరుకు చెందిన నిత్య రమేశ్‌.. ఇటీవల బెలారస్‌లో జరిగిన యూరోపియన్‌ ఓపెన్‌ ఐస్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది.

అయితే, విమానాశ్రయంలో ఆమెకు స్వాగతం పలికేందుకు అధికారులెవరూ రాలేదు. నిత్యతోపాటు విమానంలో ప్రయాణించిన ఓ మహిళ.. ఆ క్రీడాకారిణికి జరిగిన అవమానాన్ని ఫేస్‌బుక్‌లో వివరించింది. ఓ మెగా ఈవెంట్‌లో పతకం నెగ్గిన ఆ క్రీడాకారిణి ప్రతిభను గుర్తించే వారే కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేసిన సదరు మహిళ.. నిత్యతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేసింది. ఇప్పుడీ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ప్రభుత్వం క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌ అనే భేదాలు లేకుండా అన్ని క్రీడలను సమానంగా చూడాలంటూ పలువురు నెటిజన్లు కామెంట్‌ చేశారు.

స్వర్ణాన్ని గెలుచుకున్న నిత్య రమేశ్‌తో పాటు విమానంలో బెంగళూరుకు చేరిన సహ ప్రయాణికురాలు వందన బంగెరా అధికారుల నిర్లక్ష్యాన్ని తన ఫేస్ బుక్ పోస్టు ద్వారా బయటపెట్టాడు. 'ఇవాళ ఉదయం నేను ఓ అమ్మాయి త్రివర్ణంలో ఉన్న టీ షర్ట్‌తో కూర్చొని ఉంది. విమానం ఇక్కడకి చేరుకున్న తర్వాత ఆమె దగ్గరకు వెళ్లి తన గురించి అడిగాను. బదులచ్చిన నిత్య.. తాను యూరోపియన్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వెళ్లానని తెలిపింది. అదే లీగ్‌లో కాంస్యం గెలుచుకుని తిరిగొచ్చింది కూడా' అంటూ ట్వీట్ చేశారు.

ఈ పోస్టు క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. అధికారుల మాట అటుంచితే 41వేలకు పైగా లైక్‌లు, 19వేలకు పైగా షేర్‌లతో ఫేమస్ అయిపోయింది. ఇదెంతలా మారిందంటే భారత క్రికెట్ జట్టు కంటే ఎక్కువ వైరల్‌గా మారింది. సాధారణంగానే భారత్‌లో క్రికెట్ కంటే ఎక్కువ ప్రాధాన్యత మరే క్రీడకూ ఉండదు. ఇంకా ఈ పోస్టుకు 8వేల మంది నెటిజన్ల వరకూ తమ శుభాకాంక్షలు కామెంట్ల రూపంలో తెలియజేశారు.

Story first published: Wednesday, August 15, 2018, 15:24 [IST]
Other articles published on Aug 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X