బ్రిస్బేన్‌లో 2032 ఒలింపిక్ గేమ్స్‌!!

టోక్యో: 2032 ఒలింపిక్స్ క్రీడ‌ల‌ను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరగనున్నాయి. ఈ మేరకు అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ (ఐఓసీ) బుధవారం ఓ ప్ర‌క‌ట‌న చేసింది. 2000 సంవ‌త్స‌రంలో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాలో ఒలింపిక్స్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ 32 ఏళ్ల విరామం త‌ర్వాత‌ ఆస్ట్రేలియాలో ఒలింపిక్స్ క్రీడ‌లు జ‌ర‌గ‌నున్నాయి. అంతకుముందు 1956లో ఒలింపిక్స్‌కు మెల్‌బోర్న్ ఆతిథ్యం ఇచ్చింది. ఆస్ట్రేలియాలో క్రీడ‌లు విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ఏం చేయాలో త‌మ‌కు తెలుసు అని ఆ దేశ ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్ తెలిపారు.

2032 ఒలింపిక్స్​ ఆతిథ్య హక్కులను బ్రిస్బేన్​కు కేటాయిస్తూ 138వ సమావేశంలో ఐఓసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా ఐఓసీ ప్రకటించింది. '35వ ఒలింపిక్స్​ క్రీడలకు ఆతిథ్య హక్కులు దక్కించుకున్న బ్రిస్బేన్​కు అభినందనలు' అని అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ ట్వీట్ చేసింది.​ 2032 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బ్రిస్బేన్‌ను ప్రతిపాదించాలని ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు జూన్‌లోనే నిర్ణయించింది. ఆతిథ్య న‌గ‌రం కోసం జ‌రిగిన ఓటింగ్‌లో బ్రిస్బేన్‌కు 72-5 తేడాతో ఓట్లు పోల‌య్యాయి.

మరో రెండు రోజుల్లో (జూన్ 23 నుంచి ఆరంభం) టోక్యోలో విశ్వ క్రీడలు ప్రారంభం కానున్నాయి. త‌ర్వాత‌ 2024లో పారిస్‌లో, 2028లో లాస్ ఏంజిల్స్‌లో ఒలింపిక్స్ జ‌ర‌గ‌నున్నాయి. 2032 ఒలింపిక్స్ క్రీడ‌ల్లో క్రికెట్ ఆటను చేర్చనున్నారని సమాచారం. క్రికెట్‌ను విశ్వ క్రీడల్లో చేర్చుతామని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గతంలో మెగా క్రీడల్లో భాగమే అన్న విషయం తెలిసిందే.

టోక్యో ఒలింపిక్స్ క్రీడ‌ల ప్రారంభోత్స‌వ వేడుక‌లు శుక్ర‌వారం జ‌ర‌గ‌నున్నాయి. ఈసారి ఓపెనింగ్ సెర్మ‌నీ చాలా సాదాసీదాగా జ‌ర‌గ‌నున్న‌ది. క‌రోనా ఆంక్ష‌ల నేప‌థ్యంలో ప్రారంభోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వహించ‌డం లేదు. ఎటువంటి హంగామా ఉండ‌ద‌ని నిర్వాహ‌కులు స్పష్టం చేశారు. సామూహిక డ్యాన్స‌ర్లు.. లైట్ షోలు లేకుండానే ఓపెనింగ్ సెర్మ‌నీ ఉంటుంద‌ని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ మార్కో బాలిచ్ తెలిపారు.

India vs Sri Lanka: వైరల్ వీడియో.. టీమిండియా మ్యాచును ఎంజాయ్ చేసిన టీమిండియా!!India vs Sri Lanka: వైరల్ వీడియో.. టీమిండియా మ్యాచును ఎంజాయ్ చేసిన టీమిండియా!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, July 21, 2021, 15:18 [IST]
Other articles published on Jul 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X