
హైదరాబాద్: వాన పడి మైదానం తడిసింది. అంతకు ముందు వరకు ఉన్న వాతావరణ పరిస్థితి మారిపోయింది. అయినా లక్ష్యం చెక్కు చెదరలేదు. మ్యాచ్ రెండో రోజుకు వాయిదా పడిన అదే ఉత్సాహంతో ఆడి యూరోపియన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఢిల్లీకి చెందిన శుభంకర్ శర్మ, ఆదివారం జరిగిన మ్యాచ్ సాయంత్రానికి వర్షం పడటంతో వాతావరణ పరిస్థితులు సరిపడక తర్వాతి రోజుకు వాయిదా పడింది.
అయితే సోమవారం జోబర్గ్‌లోని రాండ్ పార్క్ గోల్ఫ్‌క్లబ్‌లో మళ్లీ ఆడేందుకు హాజరైన శుభంకర్ శర్మ 23 గోల్స్ చేసి విజయం సాధించాడు. అంతేగాక యూరోపియన్ టూర్స్‌లో టైటిల్‌ను గెలుచుకున్న అయిదుగురి భారతీయులలో ఒకడయ్యాడు. శుభంకర్ ఇప్పటికే ఆసియన్ టూర్‌లో భాగంగా ఎనిమిది అవార్డులను గెలుచుకున్నాడు.
21ఏళ్ల శుభంకర్‌కు ఈ అవార్డు గెలుచుకోవడం వచ్చే ఏడాది రానున్న ఓపెన్ ఛాంపియన్ షిప్‌కు మంచి ప్రేరణ కానుంది. 3 రోజుల పాటు జరిగిన ఆటలో 23 పాయింట్లతో శుభంకర్ ముందుండగా ఎరిక్ రోయెన్ 6 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందాడు.
"నాకు నిజంగా ఈ వారం ఒక అద్భుతమే. అసలు ఇక్కడికి వద్దామని అనుకోలేదు. కానీ, వచ్చి మంచి పని చేశాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మొట్ట మొదటి సారి దక్షిణాఫ్రికా వచ్చాను. అస్సలు జీవితంలో ఈ టూర్‌ని మరిచిపోను. నేను గోల్ చేయడానికి 100 శాతం కష్టపడ్డాను. ఈ మూడు రోజులు అటూ ఇటుగా ఆడి ఎలాగైతే చివరికి విజయం సాధించాను. " అని మీడియాతో తన మనోభావాలను పంచుకున్నాడు.
ఇదిలా ఉంచితే మిగిలిన స్థానాల్లో మూడో స్థానంలో షావున్ నారిస్, టాపియో పుల్కనెన్ ఉన్నారు. నారిస్, రోయోన్ ఇద్దరు వచ్చే ఏడాది జరగనున్న ఓపెన్ ఛాంపియన్ షిప్ కు మళ్లీ అర్హత పొందారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.