Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచ జిమ్నాస్టిక్స్‌లో 13వ స్వర్ణంతో చరిత్ర సృష్టించిన బైల్స్

Brilliant Biles claims record 13th gold in Doha

దోహా: అమెరికా స్టార్ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ అరుదైన ఘనత సాధించింది. శుక్రవారం దోహా వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ వ్యక్తిగత వాల్ట్‌ విభాగంలో సిమోన్‌ బైల్స్‌ స్వర్ణం సాధించింది. తద్వారా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 13 పసిడి పతకాలు నెగ్గిన తొలి జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది.

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 21 ఏళ్ల సిమోన్‌ బైల్స్‌కు ఇది నాలుగో స్వర్ణం కావడం విశేషం. తాజా స్వర్ణ పతకంతో బెలారస్‌కు చెందిన పురుష జిమ్నాస్ట్‌ విటలీ చెర్బో (12) పేరు మీద ఉన్న ఆల్‌ టైమ్‌ రికార్డును ఆమె బద్దలు కొట్టింది. ఇక, ప్రస్తుతం దోహాలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమెకిది మూడో స్వర్ణం.

ఇంకో మూడు విభాగాల్లో పోటీపడనున్న ఆమె వాటిల్లో కూడా స్వర్ణ పతకాలు గెలవాలనే పట్టుదలతో ఉంది. బైల్స్ ఈ అరుదైన ఘనతను అందుకోవడానికి ముందు కిడ్నీలో స్టోన్స్ ఉన్న కారణంగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందడం విశేషం.

Story first published: Saturday, November 3, 2018, 12:16 [IST]
Other articles published on Nov 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+