క్రీడాలోకంలో విషాదం.. నీళ్లలో శవమై తేలిన స్టార్ ప్లేయర్!
క్రీడా ప్రపంచంలో ఓ అత్యంత విషాదకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ ట్రయాథ్లెట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మారా ఫ్లేవియా(38) అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన 'ఐరన్‌మ్యాన్ టెక్సాస్' పోటీల సందర్భంగా సరస్సులో మునిగి ప్రాణాలు కోల్పోయింది. ఫిట్‌నెస్ పట్ల ఎంతో మక్కువ చూపే మారా ఫ్లేవియాకు ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. ఆమె ఆకస్మిక మరణం క్రీడాభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
సరస్సు లోతుల్లోకి..
ఈ హృదయ విదారక ఘటన శనివారం ఉదయం లేక్ వుడ్‌ల్యాండ్స్‌లో చోటు చేసుకుంది. 140 మైళ్ల సుదీర్ఘమైన ఈ ఎండ్యూరెన్స్ రేసులో ఈత అనేది మొదటి దశ. పోటీ ప్రారంభమైన కొద్దిసేపటికే.. అంటే ఉదయం 6 గంటల ప్రాంతంలో ఓ స్విమ్మర్ గల్లంతైనట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో వెంటనే మోంట్‌గోమేరీ కౌంటీ షెరీఫ్ కార్యాలయం, అగ్నిమాపక విభాగం రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. సుమారు గంటన్నర తర్వాత ఆమె గల్లంతైనట్లు అధికారికంగా నిర్ధారించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

10 అడుగుల లోతులో లభించిన మృతదేహం
సరస్సు నీటిలో స్పష్టత తక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సుమారు రెండు గంటల పాటు శ్రమించిన రెస్క్యూ బృందం.. ఉదయం 9 గంటల సమయంలో నార్త్‌షోర్ పార్క్ సమీపంలో మారా ఫ్లేవియా మృతదేహాన్ని గుర్తించింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె శరీరం సరస్సు ఉపరితలం నుంచి సుమారు 10 అడుగుల లోతులో లభించింది. ఆమె మృతదేహాన్ని వెలికి తీసిన వైద్యులు అప్పటికే మారా మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై పోటీ నిర్వాహకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
జర్నలిస్టు నుంచి అథ్లెట్‌గా..
మారా ఫ్లేవియా కేవలం అథ్లెట్ మాత్రమే కాదు, ఆమె ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి. క్రీడల్లోకి రాకముందు ఆమె దాదాపు పదేళ్ల పాటు జర్నలిజం రంగంలో పనిచేశారు. బ్రెజిల్‌లోని రేడియో, టెలివిజన్ సంస్థల్లో, ముఖ్యంగా రికార్డ్ టీవీలో సేవలందించారు. అదనంగా, ఆమె పీఆర్ (PR), కార్పొరేట్ కమ్యూనికేషన్ రంగాల్లో కూడా కీలక పాత్రలు పోషించారు. బ్రెజిల్‌లోని రిపబ్లికన్ పార్టీతో కలిసి కూడా ఆమె పనిచేశారు.
సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్
గత కొన్నేళ్లుగా మారా ఫ్లేవియా తన జీవితాన్ని పూర్తిగా ట్రయాథ్లాన్‌కు అంకితం చేశారు. ట్రయాథ్లాన్ అనేది ఈత, సైక్లింగ్, పరుగులను వరుసగా చేసే ఓ బహుళ-క్రీడా పోటీ. ఇన్‌స్టాగ్రామ్‌లో మారా ఫ్లేవియాకు 60,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. అక్కడ ఆమె తన ఫిట్‌నెస్ జర్నీ, కఠినమైన శిక్షణ , పోటీల అనుభవాలను పంచుకుంటూ యువతకు స్ఫూర్తిగా నిలిచేవారు. ఐరన్‌మ్యాన్ నిర్వహించే సుదీర్ఘ పోటీల్లో ఆమె క్రమం తప్పకుండా పాల్గొనేవారు. తన కలల పోటీలోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications