Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ట్విట్టర్లో పీవీ సింధు రికార్డ్, బ్రాండ్ కంపెనీలు క్యూ కట్టొచ్చు

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన తెలుగు తేజం పీవీ సింధుకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఫాలోయర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రియో ఒలింపిక్స్ పతకం నేపథ్యంలో ఆమె ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయారు. దీంతో ట్విట్టర్లో రికార్డులు బద్దలయ్యాయి.

సింధుకు కొత్త కోచ్: గోపీచంద్‌కు 'తెలంగాణ' షాక్, నేతల క్యూ(పిక్చర్స్)

ప్రస్తుతం సోషల్ మీడియాలో రియోలో సత్తా చాటిన యువతులు పీవీ సింధు, సాక్షి మాలిక్ (రెజ్లింగ్‌లో కాంస్యం సాధించింది), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చి తృటిలో కాంస్యం కోల్పోయింది)ల హవా నడుస్తోంది.

పీవీ సింధు సెమీ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరతో తలపడ్డ రోజే ట్విట్టర్లో ఫాలోవర్ల సంఖ్య 25వేలుగా ఉంది. ఫైనల్లో మారిన్‌తో తలపడ్డ రోజు ఆ సంఖ్య లక్షా డెబ్బై మూడువేలకు పెరిగింది. అంటే ఒక్క రోజులోనే లక్షా యాభై వేల మంది పెరిగారు.

Brands make beeline for Olympic stars Dipa

ప్రస్తుతం పీవీ సింధును ఫాలో అవుతున్న వారి సంఖ్య లక్షా తొంబై మూడు వేలుగా ఉంది. సెమీ ఫైనల్, ఫైనల్‌కు మధ్యనే ఫాలోవర్ల సంఖ్య బాగా పెరిగింది.

సింధు భుజం తట్టి-గోపీచంద్‌ని కౌగిలించుకొని, గెలిచిన వారికే కాదన్నారు.. కేటీఆర్

ఇంత వేగంగా ఫాలోవర్లను సంపాదించుకున్న క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ, సచిన్ టెండుల్కర్. ఇక దీపా కర్మాకర్ ట్విట్టర్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే 30వేల మందికి పైగా ఫాలోవర్లు వచ్చారు. సాక్షి మాలిక్ ఫాలోవర్ల సంఖ్య 25వేలగా ఉంది.

కంపెనీల కన్ను

రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన పీవీ సింధు, సాక్షి మాలిక్‌తో పాటు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న దీపా కర్మాకర్‌ల పైన పలు కంపెనీలు కన్నేసాయి. పలు బ్రాండ్ కంపెనీలు వారి కోసం ఎగబడవచ్చునని అంటున్నారు. పలు కంపెనీలు వారితో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాల కోసం ఎగబడవచ్చునని అంటున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+