Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత బాక్సర్‌ సుమిత్‌ సాంగ్వాన్‌పై ఏడాది సస్పెన్షన్‌

Boxer Sumit Sangwan gets one year ban for dope test failure

హైదరాబాద్: భారత బాక్సర్‌ సుమిత్‌ సాంగ్వాన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. సాంగ్వాన్‌ డోప్‌ పరీక్షలో విఫలమయ్యాడు. ఈ ఏడాది అక్టోబరు 10న నిర్వహించిన డోప్‌ పరీక్షలో సుమిత్‌ నిషేధిత ఉత్ర్పేరకం వాడినట్లు తేలింది. దీంతో అతనిపై ఏడాదిపాటు సస్పెన్షన్‌ విధిస్తున్నట్టు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) డీజీ నవీన్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

గత అక్టోబర్‌ నెలలో అతని నుంచి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించగా అందులో ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో ఉన్న 'ఎసిటజొలమైడ్‌' ఉన్నట్లు తేలింది. దీంతో డీజీ నవీన్‌ అగర్వాల్‌ తన ట్విట్టర్‌లో "సుమిత్‌ సాంగ్వాన్‌పై ఏడాది నిషేధం విధించాం. సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుంది" అని ట్వీట్ చేశారు.

దీంతో 91 కేజీల విభాగంలో ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశాన్ని సుమిత్ సాంగ్వాన్ కోల్పోయాడు. కాగా, ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్ షిప్‌ 91 కేజీల విభాగంలో సుమిత్ సాంగ్వాన్ రజతం నెగ్గిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, December 27, 2019, 9:22 [IST]
Other articles published on Dec 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+